Bird Flu | మెక్సికో సిటీ: మనుషుల్లో ముందెన్నడూ కనిపించని హెచ్5ఎన్2 బర్డ్‌ఫ్లూ వైరస్ వల్ల ఓ మెక్సికో దేశస్థుడు మరణించాడని బుధవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. ఏప్రిల్ 24న అతడు దవాఖానలో అనారోగ్యంతో చనిపోయాడని.. ఆ వ్యక్తికి ఆ వైరస్ ఎలా సోకిందో తెలియదని వెల్లడించలేదు.
ఒక పౌల్ట్రీ ద్వారా అది వ్యాపించి ఉండొచ్చని తెలిపింది. మనిషి ద్వారా వ్యాపించడం వల్లే సదరు వ్యక్తి మరణించాడనడానికి ఆధారాలు లేవని మెక్సికో వైద్యశాఖ పేర్కొంది. మనుషుల్లో ఈ వైరస్ వ్యాప్తి జరగకుండా శాస్త్రవేత్తలు అప్రమత్తమయ్యారు. మెక్సికోలో మార్చిలోనే బర్డ్ ఫ్లూ కేసులను గుర్తించారు.