కాందహార్ : (Talibanism) ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికన్ దళాలు ఉపసంహరించుకున్న కొన్ని గంటల్లోనే అరాచకం రాజ్యమేలుతున్నదని చెప్పడానికి సాక్ష్యంగా వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ వీడియో ఆఫ్ఘన్ కాందహార్ నగరం నుంచి వచ్చినట్లుగా తెలుస్తున్నది. అమెరికాకు చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్‌కు ఒక వ్యక్తిని కట్టి వేలాడి తిప్పినట్లుగా ఆ వీడియోలో కనిపిస్తున్నది. హెలికాప్టర్ గాలిలో తిరుగుతున్నంత సమయం దానికి వేలుడుతున్న వ్యక్తి అనేక ఇండ్లను ఢీకొంటూ వెళ్లాడం కనిపించింది.
చాలా మంది జర్నలిస్టులు ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తాలిబాన్ ఒక వ్యక్తిని చంపి కందహార్ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న యూఎస్ మిలిటరీ హెలికాప్టర్‌తో ఎత్తుకెళ్లారని పేర్కొన్నారు.
అయితే, బాధితుడు ఎవరన్నది గుర్తించేందుకు వీలుగా వీడియో లేదు. అతడు గతంలో అమెరికా వ్యాఖ్యాతగా పనిచేసినట్లు ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. అయితే, ఇంకా ఎలాంటి నిర్ధారణ కాలేదు. అలాగే, చనిపోయిందీ, లేనిదీ కూడా తెలియరాలేదు. ఈ వీడియోపై చాలా మంది నెటిజెన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి ఘటనలు మున్ముందు చాలా చూడాల్సి ఉంటుందని ఒకరు కామెంట్ చేయగా.. దీనికి జో బైడెన్ కారకుడని మరొక నెటిజెన్ కామెంట్లు రాశారు.
If this is what it looks like… the Taliban hanging somebody from an American Blackhawk… I could vomit. Joe Biden is responsible.
— Liz Wheeler (@Liz_Wheeler) August 30, 2021
pic.twitter.com/muHLEi3UvK
ఆయుధాలను ధ్వంసం చేసిన అమెరికా.. కారణమేంటంటే..?
భారత్‌లో పెరిగిన ఆర్-వ్యాల్యూ.. వేగంగా కొవిడ్ వ్యాప్తి
20 ఏండ్ల తర్వాత ఆఫ్ఘన్ చేరాడు.. ఎవరంటే..?
తాలిబాన్ దేశాన్ని ప్రపంచం గుర్తించాలి.. లేదంటే మరో 9/11 ఘటన తప్పదు: పాక్ ఎన్ఎస్ఏ
పాకిస్తాన్లో శ్రీకృష్ణుడి ఆలయం ధ్వంసం
ఏడేండ్ల వయసు వరకు పిల్లలకు పరీక్షలు రద్దు
ఖలిస్తానీ దాడి : సీఎం బియాంత్ సింగ్ దారుణహత్య
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..