Amin Ul Haq : 20 ఏండ్ల తర్వాత ఆఫ్ఘన్ చేరాడు.. ఎవరంటే..?
Amin Ul Haq : ఒసామా బిన్ లాడెన్ సన్నిహితుడు, ప్రముఖ ఆయుధ సరఫరాదారు అయిన అమిన్-ఉల్-హక్ ఆఫ్ఘనిస్తాన్‌కు తిరిగి వచ్చారు. దాదాపు 20 సంవత్సరాలపాటు పాకిస్తాన్లో జీవితం గడిపి అమిన్ ఇవాళే ఆఫ్ఘన్ చేరుకున్నాడు. విలాసవంతమైన కారులో ఇంటికి వచ్చిన...

పెషావర్ : ఒసామా బిన్ లాడెన్ సన్నిహితుడు, ప్రముఖ ఆయుధ సరఫరాదారు అయిన అమిన్-ఉల్-హక్ (Amin Ul Haq) ఆఫ్ఘనిస్తాన్‌కు తిరిగి వచ్చారు. దాదాపు 20 సంవత్సరాలపాటు పాకిస్తాన్లో జీవితం గడిపి అమిన్ ఇవాళే ఆఫ్ఘన్ చేరుకున్నాడు. విలాసవంతమైన కారులో ఇంటికి వచ్చిన అమిన్‌కు తాలిబాన్తోపాటు స్థానిక మద్దతుదారులు ఘనంగా స్వాగతం పలికారు.
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ ఆక్రమించిన తర్వాత భయంకరమైన ఉగ్రవాదులు స్వదేశానికి తిరిగి రావడం ప్రారంభించారు. వీరిలో ముఖ్యంగా ఆయుధాల సరఫరాదారు అమిన్-ఉల్-హక్ ఉన్నారు. అమెరికా దళాలు వెళ్లిపోవడానికి ఒక రోజు ముందు అమిన్ ఆఫ్ఘనిస్తాన్‌కు తిరిగి వచ్చాడు. 20 ఏండ్ల తరువాత ఆఫ్ఘనిస్తాన్లోని నాంగర్‌హార్ ప్రావిన్స్‌లోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. బిన్ లాడెన్ 9/11 దాడుల తర్వాత తొరాబోరా గుహల్లో దాక్కున్నాడు. ఆ సమయంలో అమిన్ కూడా అతనితో ఉన్నాడు. అనంతరం పాకిస్తాన్లో తలదాచుకున్నాడు. విలాసవంతమైన కారులో నంగర్హార్కు అమిన్ తిరిగి రాగానే అతడి మద్దతుదారులు ఘనంగా స్వాగతం పలికారు. కారులో నుంచే మద్దతుదారుల శుభాకాంక్షలు స్వీకరించాడు. కొంతమంది తాలిబాన్లు కూడా అమిన్ కాన్వాయ్‌లో చేరినట్లు సమాచారం.
మీడియా నివేదికల ప్రకారం, అమిన్ ఉల్ హక్ రాకతో అల్ ఖైదా మరోసారి శక్తివంతంగా తయారవొచ్చు. అమిన్ ఇంటికి వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. తెల్లటి లగ్జరీ కారులో వచ్చిన అమిన్.. మద్దతుదారుల మధ్యకు రాగానే కారు విండోను కొద్దిగా కిందికి దింపి చేతులు ఊపాడు. బిన్ లాడెన్ అల్ ఖైదాకు ఆయుధాలను సరఫరా చేయడంలో అమిన్ది ప్రముఖ పాత్ర. 2008 పాకిస్తాన్లో అరెస్ట్ అయినప్పటికీ.. నేరారోపణలను నిరూపించే ఆధారాలు లేకపోవడంతో కోర్డు విడిచిపెట్టింది.
ఇవి కూడా చదవండి..
తాలిబాన్ దేశాన్ని ప్రపంచం గుర్తించాలి.. లేదంటే మరో 9/11 ఘటన తప్పదు: పాక్ ఎన్ఎస్ఏ
పాకిస్తాన్లో శ్రీకృష్ణుడి ఆలయం ధ్వంసం
ఏడేండ్ల వయసు వరకు పిల్లలకు పరీక్షలు రద్దు
ఖలిస్తానీ దాడి : సీఎం బియాంత్ సింగ్ దారుణహత్య
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

