Beant Singh : ఖలిస్తానీ దాడి : సీఎం బియాంత్ సింగ్ దారుణహత్య
Beant Singh : పంజాబ్ సచివాలయం.. ఉదయం 12 గంటలు.. కారులో కూర్చున్న ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్.. ఎవరితోనే మాట్లాడుతున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ మానవ బాంబు తనను తాను పేల్చుకున్నాడు. ఈ సంఘటనలో సీఎం బియాంత్ సింగ్...

పంజాబ్ సచివాలయం.. ఉదయం 12 గంటలు.. కారులో కూర్చున్న ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్.. ఎవరితోనే మాట్లాడుతున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ మానవ బాంబు తనను తాను పేల్చుకున్నాడు. ఈ సంఘటనలో సీఎం బియాంత్ సింగ్ (Beant Singh) అక్కడికక్కడే విగతజీవిగా మారగా.. మొత్తం 16 మంది కూడా చనిపోయారు. ఈ హత్యాకాండకు పాల్పడిన ఇద్దరికి ఉరిశిక్ష, మరో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు శిక్ష తీర్పును కోర్టు ప్రకటించింది. ఈ ఘటన సరిగ్గా ఇదే రోజున 1995 లో జరిగింది.
భారతదేశానికి స్వాంతంత్య్రం వచ్చినప్పటి నుంచి పంజాబ్‌లో అల్లర్లు, ఆందోళనలు సర్వసాధారణంగా మారాయి. ఎప్పుడు ఏదో ఒక చోట హింస జరిగేది. ఆందోళనలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు కేంద్రం చాలా సార్లు అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. 1987 లో కూడా కేంద్రం రాష్ట్రపతి పాలనకు ఆదేశించింది. నాలుగేండ్ల తర్వాత అక్కడి అసెంబ్లీకి ఎన్నికలు జరుపగా, కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా బియాంత్ సింగ్ నియమితులయ్యారు. వేర్పాటువాదంతో హింసకు పాల్పడుతున్న ఖలిస్తానీ తీవ్రవాదుల సమస్య బియాంత్ సింగ్ ముందు పెద్ద సవాల్‌గా నిలిచింది. సచివాలయం వద్ద కారులో కూర్చుండి అధికారులతో మాట్లాడుతుండగా బెల్ట్ బాంబు రూపంలో మృత్యువు ఎదురుగా వచ్చింది. భద్రతా అధికారులు పక్కకు తప్పించేంతలో ఒక్కసారిగా విస్ఫోటనం జరిగి.. బియాంత్‌సింగ్‌తో పాటు ఎందరో ముక్కలుముక్కలుగా మారిపోయారు.
ఈ దాడికి ప్రధాన కారకులైన జగతార సింగ్, బల్వంత్ సింగ్ రాజోనాలకు పంజాబ్ కోర్టు ఉరిశిక్ష విధించింది. మరో ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. అయితే, తర్వాత జగతార సింగ్ హైకోర్టును ఆశ్రయించగా.. జగతారకు కింది కోర్టు విధించిన శిక్షను జీవిత ఖైదుగా పంజాబ్ హైకోర్టు మారుస్తూ తీర్పునిచ్చింది. కానీ, బల్వంత్ సింగ్ శిక్షను హైకోర్టు సమర్థించింది. కాగా, 2019 లో గురుపూరబ్ సందర్భంగా బల్వంత్‌సింగ్ శిక్షను జీవిత ఖైదుగా కేంద్ర హోం శాఖ మార్చింది.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
1998: జపాన్‌పై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా
1997: కారు ప్రమాదంలో యువరాణి డయానా మరణం
1991: సోవియట్ యూనియన్ నుంచి విడివడి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్న ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్
1968: రెండు దశల రౌండింగ్ రాకెట్ రోహిణి-ఎంఎస్వీ 1 విజయవంతంగా ప్రయోగించిన భారతదేశం
1957: బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన మలేషియా
1920: అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో రేడియోలో మొదటిసారిగా వార్తలు ప్రసారం
1919: అమెరికన్ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపన
1956: రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదం
ఇవి కూడా చదవండి..
ఇవి తినే 109 ఏండ్లు బతికా : జాన్ టిన్నిస్వుడ్
నాలుగు కాళ్ల తిమింగలం దొరికిందోచ్..!
తాలిబాన్ చేతికి అగ్రరాజ్యం ఆయుధాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

