4-legged whale : నాలుగు కాళ్ల తిమింగలం దొరికిందోచ్..!
4-legged whale : 43 మిలియన్ సంవత్సరాల వయస్సు గల 4 కాళ్ల తిమింగలాన్ని ఈజిప్టులో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ జాతికి ఈజిప్షియన్ దేవుడు అనుబిస్ పేరును కలిపి ఫియోమిసెటస్ అనుబిస్ అని పేరు పెట్టారు..

కైరో: 43 మిలియన్ సంవత్సరాల వయస్సు గల 4 కాళ్ల తిమింగలాన్ని (4-legged whale) ఈజిప్టులో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ జాతికి ఈజిప్షియన్ దేవుడు అనుబిస్ పేరును కలిపి ఫియోమిసెటస్ అనుబిస్ అని పేరు పెట్టారు. ఫియోమిసెటస్ అనుబిస్ శిలాజాలను ఈజిప్టులోని పశ్చిమ ఎడారిలో కనుగొన్నారు. ఈ తిమింగలం బరువు 600 కిలోగ్రాములు, మూడు మీటర్ల పొడవు ఉన్నది. తిమింగలంకు నాలుగు కాళ్లు ఉండటంతో భూమిపై నడవడమే కాకుండా నీటిలో ఈత కూడా కొట్టినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అధ్యయనాన్ని మన్సౌరా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు బుధవారం ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ బి: బయోలాజికల్ సైన్సెస్’లో ప్రచురించారు.
ఫియోమిసెటస్ అనుబిస్ అనే ఈ కొత్త తిమింగలం.. ఈజిప్షియన్-ఆఫ్రికన్ పాలియోంటాలజీకి కీలకమైన ఆవిష్కరణ అని అధ్యయనం ప్రధాన రచయిత అబ్దుల్లా గోహర్ చెప్పారు. పాలియోంటాలజిస్టులు 2008 లో 56 నుంచి 33.9 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి సముద్ర జీవిత శిలాజాలకు ప్రసిద్ధి చెందిన వాటిని కనుగొన్నారని పరిశోధనా బృందానికి పర్యవేక్షకుడిగా ఉన్న మన్సౌరా యూనివర్సిటీ సెంటర్ ఫర్ వెర్టిబ్రేట్ ఫాసిల్స్ చైర్మన్ హిషమ్ సల్లం తెలిపారు.
ఈజిప్ట్తోపాటు ఇతర ప్రాంతాల్లోని ఇతర తిమింగలాల నమూనాలతో వీటిని పోల్చి డాక్యుమెంట్ చేయడానికి, రికార్డ్ చేయడానికి పరిశోధనా బృందానికి నాలుగేండ్ల సమయం పట్టింది. కొత్త జాతి ఆఫ్రికాలో కనుగొనబడిన అతి పురాతన తిమింగలంగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి..
అంతర్జాతీయ విమానాలపై సస్పెన్షన్ పొడగింపు
తాలిబాన్ చేతికి అగ్రరాజ్యం ఆయుధాలు
సముద్రం నుంచి అంతరిక్షంలోకి తొలి ఫోన్ కాల్
సబ్ ఖేలే.. సబ్ ఖిలే.. మన్ కీ బాత్లో మోదీ
ఇక కొత్తగా వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

