Aquanaut and Astronaut : సముద్రం నుంచి అంతరిక్షంలోకి తొలి ఫోన్ కాల్
Aquanaut and Astronaut : సముద్రంలో 205 అడుగుల దిగువ నుంచి మొదటిసారిగా ఆక్వానాట్.. స్పేస్ మిషన్‌లో ఉన్న తన వ్యోమగామి స్నేహితుడితో రేడియో టెలిఫోన్లో మాట్లాడాడు. ఇది జరిగి నేటికి సరిగ్గా 56 ఏండ్లు...

సముద్రంలో 205 అడుగుల దిగువ నుంచి మొదటిసారిగా ఆక్వానాట్.. స్పేస్ మిషన్‌లో ఉన్న తన వ్యోమగామి (Aquanaut and Astronaut) స్నేహితుడితో రేడియో టెలిఫోన్లో మాట్లాడాడు. ఇది జరిగి నేటికి సరిగ్గా 56 ఏండ్లు పూర్తికావచ్చాయి. ఈ రోజు కమ్యూనికేషన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్నది.
అమెరికా తన జెమిని-5 అంతరిక్ష నౌకను 1965 ఆగస్ట్ 21 న ప్రయోగించింది. ఈ నౌకలో గోర్డాన్ కూపర్, పీట్ కాన్రాడ్ అంతరిక్షానికి వెళ్లారు. తాము తయారు చేసిన బ్యాటరీ 8 రోజుల పాటు పనిచేస్తుందా లేదా అనేది తెలుసుకోవడానికి నాసా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. వారిద్దరూ అంతరిక్షంలో రికార్డులు సృష్టించే పనిలో ఉండగా.. కూపర్ స్నేహితుడైన స్కాట్ కార్పెంటర్ నాసా ప్రయోగంలో భాగంలో ఆక్వానాట్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. లోతైన సముద్ర డైవింగ్ మానవులపై ఎలాంటి శారీరక, మానసిక ప్రభావాలను చూపిస్తుంది అనేది అధ్యయనం చేయడం అమెరికా నేవీ సీలాబ్-II మిషన్ చేపట్టింది. ఈ అధ్యయనం చేసేందుకు పసిఫిక్ మహా సముద్రంలో 205 అడుగుల కిందికి వెళ్లిన స్కాట్.. అక్కడి నుంచి కూపర్‌తో రేడియో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఇంత లోతు నుంచి అంత ఎత్తుపైకి రేడియో టెలిఫోన్ ద్వారా సంభాషించడం ఇదే మొదటిది.
మరుసటి రోజు కూపర్, పీట్ అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చారు. స్కాట్ మాత్రం 30 రోజుల పాటు సముద్ర గర్భంలోనే గడిపారు. సముద్రం అడుగున ఎక్కువ కాలం గడిపిన వ్యక్తిగా స్కాట్ రికార్డ్ సాధించారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
ఇవాళ తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం
1997: నెట్‌ఫ్లిక్స్ అనే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను స్థాపించిన అమెరికన్ పారిశ్రామికవేత్తలు రీడ్ హేస్టింగ్స్, మార్క్ రాండోల్ఫ్
1958: అమెరికన్ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ జననం
1949: తన మొదటి అణు బాంబును పరీక్షించిన సోవియట్ యూనియన్
1947: భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన బాబాసాహెబ్ అంబేద్కర్
1905: భారత హాకీ స్టార్ ప్లేయర్ మేజర్ ధ్యాన్‌చంద్ అలహాబాద్‌లో జననం
1831: విద్యుదయస్కాంత ప్రేరణను కనుగొన్న మైఖేల్ ఫారడే
1612: సూరత్ యుద్ధంలో బ్రిటీష్ చేతిలో ఓటమిపాలైన పోర్చుగీసు
ఇవి కూడా చదవండి..
సబ్ ఖేలే.. సబ్ ఖిలే.. మన్ కీ బాత్‌లో మోదీ
ఇక కొత్తగా వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ
పెండ్లి పందిరిలో పుషప్స్.. వావ్ గ్రేట్!
కొవిడ్ మార్గదర్శకాలు సెప్టెంబర్ 30 వరకు పొడగింపు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

