Bride and Groom Pushups : పెండ్లి పందిరిలో పుషప్స్.. వావ్ గ్రేట్!
Bride and Groom Pushups : ఇద్దరు ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ తమ పెండ్లి రోజున పందిరిలోనే తమ ఫిట్నెస్ గురించి మాట్లాడుకోవడమే కాకుండా పుషప్స్ తీయడం.. పెండ్లికి వచ్చిన వారు...

ఎవరైనా ఇద్దరు వ్యక్తులు తారసపడినప్పుడు వారి వ్యాపారం గురించే మాట్లాడుకుంటారు. అలాగే, టీచర్లు స్కూల్ ముచ్చట్లు, పొలిటీషియన్లు రాజకీయాల గురించి మాట్లాడుకోవడం మనం వింటుంటాం. అదే, ఇద్దరు ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ జంటగా మారితే.. వారు కూడా వారి పని గురించే చర్చించుకుంటారు. అయితే, ఈ ఇద్దరు ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ తమ పెండ్లి రోజున పందిరిలోనే తమ ఫిట్నెస్ గురించి మాట్లాడుకోవడమే కాకుండా పుషప్స్ తీయడం.. (Bride and Groom Pushups) పెండ్లికి వచ్చిన వారు కొత్త అనుభూతికి లోనయ్యారు.
న్యూఢిల్లీకి చెందిన అక్షిత, అదిత్య మహజన్.. ఇద్దరూ ఫిట్నెస్ ఎక్స్‌పర్ట్స్‌గా సేవలందిస్తున్నారు. వీరు ఇటీవలనే పెండ్లి చేసుకున్నారు. అయితే, పెండ్లి పందిరిలో ఉన్నా తమకు ఇష్టమైన పుషప్స్‌ను మాత్రం మరిచిపోలేదు. అందరూ చూస్తుండగానే, పెండి పందిరిలోనే ఇద్దరూ పోటాపోటీగా పుషప్స్ తీసి ఔరా! అనిపించారు. వరుడు షేర్వాణిలో వ్యాయామం చేస్తుండగా.. వధువు భారీ లెహంగా, ఆభరణాలు ధరించి మరీ పుషప్స్ తీసింది. ఒకరిని మించి మరొకరు పుషప్స్ తీయడంతో పెండ్లికి వచ్చినవారంతా ‘ఫిట్నెస్ ప్రాప్తిరస్తు’ అంటూ దీవించి వెళ్లారు. ఈ వీడియోను పెండ్లికొడుకు ఆదిత్య తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. దీనిపై నెటిజెన్లు సరదా కామెంట్లు చేస్తూ కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మోడెర్నా వ్యాక్సిన్‌తో ఇద్దరు మృతి
కొవిడ్ మార్గదర్శకాలు సెప్టెంబర్ 30 వరకు పొడగింపు
అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం
ఒక్క రోజే కోటి డోసులు : డబ్ల్యూహెచ్ఓ అభినందన
అసోంలో మళ్లీ హింసాకాండ : ఐదుగురు డ్రైవర్లు సజీవ దహనం
చారిత్రాత్మకంగా నిలిచిన ప్రిన్సెస్ డయనా విడాకులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

