Fish and Chips : ఇవి తినే 109 ఏండ్లు బతికా : జాన్ టిన్నిస్వుడ్
Fish and Chips : మనం ఆరోగ్యకరంగా ఎక్కువ కాలం జీవించాలంటే చాలా రహస్యాలు ఉన్నాయి. దీర్ఘకాలం ఎలా జీవిస్తున్నారని ఎవరినైనా అడిగితే.. మంచి ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ...

(Fish and Chips) మనం ఆరోగ్యకరంగా ఎక్కువ కాలం జీవించాలంటే చాలా రహస్యాలు ఉన్నాయి. దీర్ఘకాలం ఎలా జీవిస్తున్నారని ఎవరినైనా అడిగితే.. మంచి ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సిగరెట్ స్మోకింగ్ చేయకపోవడం, ఆల్కహాల్‌ను దూరంగా పెట్టడం వంటి ఎన్నో మంచి అలవాట్లు చెప్తుంటారు. ఇలాంటి సూచనలు సర్వసాధారణంగా ప్రతీ ఒక్కరి నుంచి వస్తుంటాయి. అయితే, 109 ఏండ్ల బ్రిటీష్ పౌరుడు జాన్ టిన్నిస్వుడ్ను అడిగితే ఆయన చెప్పేది విని షాక్ అవడం మీవంతవుతుంది.
బ్రిటన్‌లోని సౌత్ పోర్ట్ ప్రాంతంలో ఉన్న హూలీస్ రెస్ట్ హోంలో నివసించే జాన్ టిన్నిస్వుడ్ ఇటీవలనే తన 109 వ పుట్టిన రోజును జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన తన సుదీర్ఘ జీవితప్రయాణానికి కారణాలేంటని అడిగిన వారికి.. జీవితాన్ని తేలిగ్గా తీసుకోవాలంటూ సలహా ఇస్తున్నాడు. మరో మాటలో చెప్పాలంటే.. ‘జీవితంలో అన్ని మంచి విషయాల నుంచి ముఖ్యంగా ఆహారం నుంచి మనల్ని మనం పరిమితం చేసుకోకూడదు. మనకు నచ్చిన విషయాలలో మునిగిపోవడం చాలా అవసరం. లేకపోతే మిమ్మల్ని మీరు శారీరకంగా లేదా మానసికంగా గాయపరుచుకుంటారు’ అని జాన్ సెలవిస్తున్నాడు. ప్రతి శుక్రవారం సాయంత్రం చిప్పీ టీ తాగే జాన్.. ఆరోగ్యం, భవిష్యత్ గురించి ఒత్తిడిని తీసుకోవడంలో ఎలాంటి ఉపయోగం ఉండదంటున్నాడు. అయితే, ఏదైనా అతిగా చేయకుండా చూసుకోవాలని ప్రజలను హెచ్చరిస్తున్నాడు.
బ్రిటన్‌లో అత్యధిక కాలం పాటు జీవించి వున్న వారిలో జాన్ టిన్నిస్వుడ్ 9 వ వాడు. ప్రతి శుక్రవారం సాయంత్రం ప్లేట్ నిండా చేపలు, చిప్స్ తినడం అలవాటు అని, ఇవే తన సుదీర్ఘ జీవితానికి ముఖ్య కారకాలని చెప్తున్నాడు. ఎప్పుడు శుక్రవారం వస్తుందా.. ఎప్పుడు నాకిష్టమైన చేపలు, చిప్స్ తింటానా..? అని ఎదురుచూడటంలోనే యవ్వనం పొందుతానని కూడా అంటున్నాడీయన. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభానికి ముందు జన్మించిన జాన్ టిన్నిస్వుడ్.. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో రాయల్ మెయిల్లో అధికారిగా సేవలందించారు. 1942 లో బ్లోడ్వెన్ను పెండ్లాడిన జాన్ వందో పుట్టినరోజు సందర్భంగా బ్రిటీష్ మహారాణి నుంచి 9 విషెస్ టెలీగ్రాములు అందాయంట.
ఇవి కూడా చదవండి..
రాముడు లేకుండా అయోధ్య లేదు : రామ్‌నాథ్ కోవింద్
నాలుగు కాళ్ల తిమింగలం దొరికిందోచ్..!
అంతర్జాతీయ విమానాలపై సస్పెన్షన్ పొడగింపు
తాలిబాన్ చేతికి అగ్రరాజ్యం ఆయుధాలు
సముద్రం నుంచి అంతరిక్షంలోకి తొలి ఫోన్ కాల్
సబ్ ఖేలే.. సబ్ ఖిలే.. మన్ కీ బాత్‌లో మోదీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Protests | సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో మళ్లీ మొదలైన ఆందోళనలు.. పలువురు అరెస్ట్
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

