e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 17, 2021
Home News భార్య కోసం రొటేటింగ్ హౌస్ నిర్మించిన వ్యాపారి!

భార్య కోసం రొటేటింగ్ హౌస్ నిర్మించిన వ్యాపారి!

న్యూఢిల్లీ : బోస్నియాలో ఓ వినూత్న నిర్మాణం అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. అది ప్రేమ‌కు చిహ్నంగా నిర్మించిన తాజ్ మ‌హ‌ల్ వంటి క‌ట్ట‌డం కాకున్నా భార్య ప‌ట్ల భ‌ర్త‌కు ఉన్న ప్రేమ‌కు సంకేతంగా నిలుస్తోంది. వొజిన్ కుసిక్ (72) అనే వ్యాపారి త‌న భార్య జుబికా కోరుకున్న రీతిలో ఇంటిని నిర్మించి ఆమెకు కానుక‌గా ఇచ్చాడు. రెడ్ మెట‌ల్ రూఫ్‌తో వెంటిలేష‌న్ కోసం పలు కిటీకీల‌ను అమ‌ర్చి నిర్మించిన ఈ ఇంటి ప్ర‌త్యేక‌త ఫుల్ స‌ర్కిల్‌లో రొటేట్ కావ‌డం. త‌న భార్య కావాల్సిన దృశ్యాల‌ను చూసేందుకు అనువుగా ఇంటిని ఎటువైపు అయినా తిప్పే వెసులుబాటుతో దీన్ని నిర్మించాన‌ని కుసిక్ చెబుతున్నాడు. ఫ్యామిలీ బిజినెస్‌ను పిల్ల‌ల‌కు అప్ప‌గించి విశ్రాంత జీవ‌నం గ‌డుపుతున్నప్ప‌టి నుంచి ఈ ఇంటి డిజైనింగ్‌పై ఫోక‌స్ పెట్టాన‌ని చెప్పాడు.

గ‌తంలో తామున్న ఇంటికి సంబంధించి త‌మ‌ బెడ్‌రూంలు సూర్యుడికి అభిముఖంగా ఉండాల‌ని ఓసారి త‌న భార్య‌ కోరుకోగా త‌న‌కు ఇలాంటి ఐడియా వ‌చ్చింద‌ని రిటైర్ అయిన త‌ర్వాత ఆమె అభిరుచికి అనుగుణంగా ఇంటిని డిజైన్ చేసేందుకు త‌న‌కు స‌మ‌యం ల‌భించింద‌ని అన్నారు. ఇంటి ముందు నుంచి లోప‌లికి వ‌చ్చే వారిని తాను చూడ‌కుండా ఉండే ఏర్పాటు ఉండాల‌ని కూడా ఆమె కోరుకోవ‌డంతో అన్నింటినీ రీమోడ‌ల్ చేయ‌డంపై క‌స‌ర‌త్తు చేశాన‌ని కుసిక్ వివ‌రించాడు. త‌మ రెండు బెడ్‌రూంల మ‌ధ్య గోడ‌ను తొల‌గించి లివింగ్ రూంగా మార్చాన‌ని రొటేటింగ్ ఇల్లు త‌మ కుటుంబ స‌భ్యులంద‌రికీ భిన్న‌మైన వ్యూస్‌ను అందిస్తోంద‌ని చెప్పుకొచ్చాడు. తాను శిక్ష‌ణ పొందిన ప్రొఫెష‌న‌ల్ కాకున్నా త‌న భార్య కోరిక మేర‌కు ఇంటిని రీడిజైన్ చేశాన‌ని చెప్పాడు. త‌మ ఫ్రంట్ డోర్ కూడా ఇప్పుడు రొటేట్ అవుతుంద‌ని, త‌న భార్య రాకూడ‌ద‌ని కోరుకున్న అతిధులు ఎవ‌రైనా వ‌చ్చినా ఇంటిని తిప్పివేసి వారు వెనుదిరిగేలా చేయ‌గ‌ల‌ద‌ని కుసిక్ జోక్ చేశాడు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement