మంగళవారం 14 జూలై 2020
International - Jun 30, 2020 , 11:26:20

ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేసేట‌ప్పుడు జాగ్ర‌త్త‌.. లేదంటే వీరిలా 28 కోట్లు పోగొట్టుకుంటారు!

ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేసేట‌ప్పుడు జాగ్ర‌త్త‌.. లేదంటే వీరిలా 28 కోట్లు పోగొట్టుకుంటారు!

ఇప్పుడు ఏ చిన్న వ‌స్తువు కావాల‌న్నా ఆన్‌లైన్‌నే సంప్ర‌దిస్తున్నారు. బ‌య‌ట కొనేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌ట్లేదు. ఇలా చేసుకోవ‌డం మంచిదే.. కాక‌పోతే ఏదేని చిన్న పొర‌పాటు జ‌రిగినా అకౌంట్‌లో ఉన్న డ‌బ్బు మొత్తం ఉష్‌కాకి! ఇప్పుడు ఇదంతా చెప్ప‌డానికి ఒక పెద్ద కార‌ణ‌మే ఉంది.

జ‌ర్మ‌నీకి చెందిన ఓ తండ్రీకొడుకులు ఆన్‌లైన్‌లోనే తెస్లా లగ్జరీ కారును కొనాలని అనుకున్నారు. బుకింగైతే ఒక కారుకే చేసుకున్నారు. కానీ, అమౌంట్ మాత్రం 28 కార్ల‌కు స‌రిప‌డా అంటే.. రూ. 12 కోట్లు బ్యాంక్ ఖాతా నుంచి డెబిట్ అయ్యాయి. వ‌చ్చిన మెసేజ్‌ను చూడ‌గానే తండ్రీకొడుకులు ఇద్ద‌రికీ గుండె ఆగినంత ప‌నైంది. వీరు ఈ కారును రెడిట్ అనే బ్లాగింగ్ వెబ్‌సైట్‌లో బుక్ చేశారు. వెంట‌నే వెబ్‌సైట్ వాళ్ల‌కి కాల్ చేసి విష‌యం తెలియ జేశారు.

త‌ప్పు వెబ్‌సైట్‌దే అని నిర్ధార‌ణ అయిన త‌ర్వాత కంపెనీ వాళ్లు తిరిగి టోట‌ల్ అమౌంట్‌‌ను క్రెడిట్ చేసేశారు. కంపెనీ వారు ముందు చేసిన ఆర్డ‌ర్‌ను పూర్తిగా ర‌ద్దు చేశారు. తాజాగా మ‌రోసారి ఆర్డ‌ర్ చేయాల‌ని వారిని కోరారు. దీంతో వారు రెండోసారి ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని న‌చ్చిన కారును ఆర్డ‌ర్ చేశారు. కాబ‌ట్టి ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డ‌ర్ పెట్టేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఒక‌టికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. లేదంటే వీరికి జ‌రిగిన‌ట్లే జ‌రుగుతుంది. ఆ కంపెనీ మంచిది కాబ‌ట్టి అమౌంట్‌ను తిరిగి ఇచ్చారు. అంద‌రూ వీరిలా ఉండ‌రు క‌దా!logo