Mohamed Muizzu | న్యూఢిల్లీ : మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్ సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచ పత్రికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన 14 గంటల 54 నిమిషాలపాటు మాట్లాడారు. ఉదయం 10 గంటలకు ప్రారంభించి, మధ్య మధ్యలో ప్రార్థనల కోసం కాస్త విరామం ఇచ్చారు. సుదీర్ఘ సమయం ప్రెస్ మీట్ నిర్వహించి సరికొత్త రికార్డును ముయిజ్జు నమోదు చేశారు.