సోమవారం 30 నవంబర్ 2020
International - Oct 26, 2020 , 07:32:48

పాక్‌లో 4.8 తీవ్ర‌త‌తో భూకంపం

పాక్‌లో 4.8 తీవ్ర‌త‌తో భూకంపం

ఇస్లామాబాద్: ‌దాయాది దేశం పాకిస్థాన్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీనితీవ్ర‌త రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. ఈరోజు ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ అంత‌ర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించింద‌ని అధికారులు తెలిపారు. అయితే భూకంప కేంద్రం ఎక్క‌డ ఉంద‌నే విష‌యం ఇంకా తెలియ‌రాలేద‌ని వెల్ల‌డించారు. కాగా, భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు.