Layoffs | ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ (Layoffs) పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖ ఐటీ సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. తాజాగా జర్మనీకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్స (Lufthansa) ఎయిర్‌లైన్స్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న ఐదేండ్లలో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించనుంది. 2023 నాటికి 4,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు సంస్థ తాజాగా ప్రకటించింది. ఖర్చులను తగ్గించి కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
తన కార్యకలాపాల విస్తృత సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లుఫ్తాన్స తన ప్రకటనలో తెలిపింది. అంతేకాదు సంస్థ పునర్నిర్మాణంతోపాటూ 2028 నుంచి 30 వరకు కొత్త ఆర్థిక లక్ష్యాలను కూడా నిర్దేశించుకుంది. ఈ కాలంలో 8 శాతం నుంచి 10 శాతం వరకూ ఆపరేటింగ్ మార్జిన్‌ను సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా సంస్థ నిర్ణయంతో ఈ లేఆఫ్స్ ప్రధానంగా అడ్మినిష్టేటివ్ రోల్స్‌పై ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థలో దాదాపు 103,000 మంది ఉన్నారు.
జర్మనీ వరుసగా రెండో ఏడాది కూడా తీవ్ర ఆర్థిక మాంద్యం (recession) ఎదుర్కొంటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. నిరుద్యోగం పదేళ్లలో అత్యధిక స్థాయికి చేరుకుంది. దేశంలోని పెద్ద కంపెనీలు.. పెరుగుతున్న ఇంధన ఖర్చులు, చైనా నుంచి పోటీ, కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించడంలో పురోగతి లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సదరు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే జర్మనీలోని పలు సంస్థలు ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం బోష్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 13,000 ఉద్యోగాలను తగ్గిస్తామని ప్రకటించింది. అంటే మొత్తం ఉద్యోగుల్లో 3 శాతం అన్న మాట.
Also Read..
Modi-Meloni | మెలోనీ ఆత్మకథకు ప్రధాని మోదీ ముందుమాట.. మరోసారి తెరపైకి ‘మెలోడీ’ మూమెంట్
School Children | హోమ్‌వర్క్ చేయలేదని.. చిన్నారిని కిటికీకి వేలాడదీసి చితకబాదారు
Asia Cup trophy | ట్రోఫీని ఆయన ఎలా తీసుకెళ్తారు..? పీసీబీ చీఫ్ తీరుపై బీసీసీఐ ఆగ్రహం