Los Angeles | అమెరికా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిలస్ (Los Angeles) నగరంలో భారీ అగ్నిప్రమాదం (Fire Breaks) సంభవించింది. లాస్ ఏంజిలస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దక్షిణంగా ఉన్న శివారు ప్రాంతమైన ఎల్ సెగుండో (El Segundo) ప్రాంతంలో గల చెవ్రాన్ చమురు శుద్ధి కర్మాగారం (Chevron Oil Refinery)లో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి మంటలు చెలరేగాయి.
explosion and massive fire erupts at the Chevron refinery in El Segundo. Towering flames and billowing smoke can be seen for miles all around the Southland pic.twitter.com/Ow6ImQ4Une
— ZoomCenter (@ZoomCenter) October 3, 2025
కాసేపటికే మంటలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఎగసిపడడ్డాయి. దీంతో ఆకాశం మొత్తం అగ్నిగోళాన్ని తలపించింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కాలిఫోర్నియా అధికారులు సూచించారు. ఘటనకు సంబంధించిన వీడియోలను స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అవికాస్తా ప్రస్తుతం వైరల్గా మారాయి. ఆ వీడియోల్లో శుద్ధి కర్మాగారం నుంచి పెద్ద శబ్దంతో మంటలు ఎగసిపడుతున్నట్లు కనిపించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
🇺🇲 El Segundo: Chevron refinery fire. https://t.co/aLuWeyEyqm pic.twitter.com/KA2K34NmHN
— Argonaut (@FapeFop90614) October 3, 2025
నివేదికల ప్రకారం.. చెవ్రాన్స్ చమురు శుద్ధి కర్మాగారం కాలిఫోర్నియాలో రెండో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ. ఇది రోజుకు 276,000 బ్యారెళ్లకు పైగా ముడి చమురును ప్రాసెస్ చేస్తుంది. వీటిలో గ్యాసోలిన్, జెట్, డీజిల్ ఇంధనాలు ఉన్నాయి. ఈ శుద్ధి కర్మాగారం దాదాపు 1.5 చదరపు మైళ్లు (3.9 చదరపు కిలోమీటర్లు) విస్తరించి ఉంది.
Also Read..
Cough syrup | చిన్నారుల ప్రాణాలు తీస్తున్న దగ్గు మందు.. కిడ్నీ వైఫల్యంతో తొమ్మిది మంది మృతి
Sonam Wangchuk | నా భర్తను కలవనివ్వట్లేదు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వాంగ్చుక్ భార్య