Israel-Iran | ఇజ్రాయెల్-ఇరాన్ (Israel-Iran) మధ్య యుద్ధం తీవ్రరూపం దాలుస్తున్న విషయం తెలిసిందే. వారం రోజులుగా రెండు దేశాలు పోటాపోటీగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. ఈ దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం (Mediate) వహించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే.
పుతిన్ మధ్యవర్తిత్వం ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యంగ్యంగా స్పందించారు. రష్యా అధ్యక్షుడు మొదట ఉక్రెయిన్‌తో తన యుద్ధాన్ని ముగించుకోవాలని వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్ వద్ద విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. తాను పుతిన్‌తో మాట్లాడినట్లు చెప్పారు. అప్పుడు ఆయన ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. అప్పుడు తాను ముందు ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపండని సూచించాను. ఆ తర్వాత దీని (ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం) గురించి ఆలోచిద్దాం అని పుతిన్‌కు చెప్పినట్లు ట్రంప్ వివరించారు.
Also Read..
Iranian Missile: ఇరాన్ మిస్సైల్ దాడిలో.. ఇజ్రాయిలీ ఆస్పత్రి ధ్వంసం
Donald Trump | ఇరాన్‌పై దాడికి సిద్ధమైన అమెరికా.. ప్రైవేట్‌గా ట్రంప్ గ్రీన్ సిగ్నల్..!