చల్లదనానికి ప్రతీక మంచు అయితే.. వేడికి ప్రతిరూపం నిప్పు. అయితే ఈ రెండూ కలిసి ప్రయాణించిన అపురూప దృశ్యం ఇటలీ ప్రావిన్స్ సిసిలీ తూర్పు తీరానికి సమీపంలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతంపై ఆవిష్కృతమైంది. యూరప్‌లోనే ఎత్తయిన ఈ అగ్ని పర్వతం ఈ నెలలో బద్దలైంది. బొక్కనువా బిలం నుంచి లావా విస్ఫోటం సంభవించింది. అప్పటికే మంచుతో కప్పబడిన శిఖరం నుంచి లావా కిందకు ప్రవహించింది. ఈ ఆరుదైన, ఆకర్షణీయమైన దృశ్యం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది.