Donald Trump | వాషింగ్టన్ డీసీ : లష్కరే తాయిబాతో సంబంధం ఉన్న ఒక ఉగ్రవాదిని, ఎన్ఐఏ అభియోగాలున్న మరో వ్యక్తిని అమెరికా ప్రభుత్వం తన సలహాదారులుగా నియమించుకున్నది. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్న ఇస్మాయిల్ రోయర్, షయేక్ హమ్జా యూసుఫ్‌ను మత స్వేచ్ఛకు సంబంధించిన కమిషన్‌లో ట్రంప్ నియమించారు.
2003లో రోయర్పై అమెరికాలో ఉగ్రవాద అభియోగాలతో కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు 2004లో కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది. షయేక్ హమ్జా యూసుఫ్‌ను ‘పశ్చిమ దేశాల్లో అత్యంత ప్రభావవంతమైన ఇస్లామిక్ స్కాలర్’గా పిలుస్తుంటారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడంటూ హమ్జాపై ‘నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ’ (ఎన్ఐఏ) 2016లో కేసు నమోదు చేసింది.