North Korea | సియోల్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు సహాయంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన సైనిక బలగాలను పంపారని దక్షిణకొరియా నిఘా సంస్థ పేర్కొంది. ఈ చర్య ఉత్తర కొరియా, పశ్చిమ దేశాల మధ్య ప్రతిష్టంభనను మరింత తీవ్రతరం చేసిందని విమర్శించింది. రష్యా నౌకాదళానికి చెందిన షిప్పుల ద్వారా ఈ నెల 8 నుంచి 13 మధ్య ఉత్తర కొరియాకు చెందిన 1,500 ప్రత్యేక ఆపరేషన్ దళాలను రష్యా పోర్టు సిటీకి తరలించినట్టు నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (ఎన్ఐఎస్) ఒక ప్రకటనలో తెలిపింది. త్వరలోనే మరిన్ని ట్రూప్‌లు రష్యాకు వెళ్లనున్నట్టు వెల్లడించింది.
రష్యా సైన్యంలో 10 వేల మంది ఉత్తర కొరియా సైనికులు చేరేందుకు ఏర్పాట్లు జరిగినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. రష్యాతో తాము చేస్తున్న యుద్ధంలో మూడో దేశం జోక్యం చేసుకుంటే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చని హెచ్చరించారు.