Kim Jong Un: అమెరికా దూకుడును తప్పుపట్టిన కిమ్ జాంగ్
Kim Jong Un : అమెరికా దూకుడును ఉత్తరకొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ తప్పుపట్టారు. అమెరికా సర్కారు ఉగ్రదాడులకు పాల్పడుతున్నట్లు ఆయన ఆరోపించారు. పార్లమెంట్లో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ దేశ అణ్వాయుధ సమీకరణను ఆయన సమర్ధించుకున్నారు.
ప్యోంగ్యాంగ్: ఇరాన్‌పై దాడి చేసిన అమెరికా దూకుడు వైఖరిని ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్(Kim Jong Un) తప్పుపట్టారు. సోమవారం పార్లమెంట్లో మాట్లాడుతూ తమ దేశం సమకూర్చుకుంటున్న అణ్వాయుధాలను ఆయన సమర్ధించుకున్నారు. కిమ్ ప్రసంగానికి చెందిన అంశాలను మంగళవారం ఆ దేశ మీడియా రిలీజ్ చేసింది. దేశంలో అన్ని రంగాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు కిమ్ చెప్పారు. సైన్యం, భద్రత అంశంలోనూ తమ ప్రభుత్వం చర్యలు తీసుకున్నదన్నారు.
ఇరాన్లో కొనసాగుతున్న అమెరికా దాడుల గురించి ప్రస్తావిస్తూ.. సార్వభౌమ దేశాల హక్కులను అగ్రరాజ్యం కాలరాస్తోందన్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రాంత సుస్థిరత, శాంతి కోసం అణ్వాయుధాల సమీకరణ అవసరం అని అన్నారు. కిమ్ తన ప్రసంగంలో నేరుగా ట్రంప్ పేరును ప్రస్తావించలేదు. కానీ, అమెరికా ప్రభుత్వం ఉగ్ర దాడులకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా దూకుడుగా వ్యవహరిస్తోందన్నారు. ఇరాన్‌తో ఫలప్రదంగా చర్చలు జరుగుతున్నట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ.. సమరమైనా, సంధి అయినా, ఆ నిర్ణయం అమెరికా చేతుల్లోనే ఉందన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

