మాస్కో: సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఆదివారం ఓ కేఫ్‌లో జరిగిన పేలుడులో రష్యాకు చెందిన వార్ బ్లాగర్(war blogger) వ్లాడ్లెన్ టాటార్స్కీ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ పేలుడుకు పాల్పడింది ఉక్రెయిన్ అని రష్యా ఆరోపిస్తున్నది. ఈ కేసులో దరియా ట్రోపోవా అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ పేలుడుకు తానే కారణమని దరియా చెబుతున్న వీడియోను రిలీజ్ చేశారు. పీటర్స్‌బర్గ్‌లో జరిగిన పేలుడు బ్లాగర్ వ్లాడ్లెన్ మృతిచెందగా, మరో 30 మంది గాయపడ్డారు. తన మద్దతుదారులతో ఓ కేఫ్‌లో మీటింగ్ పెట్టుకుని మాట్లాడుతున్న సమయంలో పేలుడు ఘటన జరిగింది.బ్లాగర్ హత్యను టెర్రరిస్టు దాడిగా రష్యా ఆరోపించింది.