Indian Consulate | ఖలిస్తానీ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భారత్-కెనడా (India-Canada) మధ్య దౌత్య సంబంధాలు తిరిగి ప్రారంభమైన వేళ తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డారు. వాంకోవర్ (Vancouver)లోని భారత కాన్సులేట్ (Indian Consulate)ను స్వాధీనం చేసుకుంటామంటూ హెచ్చరించారు. అమెరికాకు చెందిన ఖలిస్తానీ సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (Sikhs for Justice) ఈ బెదిరింపులకు పాల్పడింది. ఈ నెల 18న (గురువారం) వాంకోవర్‌లోని భారత కాన్సులేట్‌ను ముట్టడించి స్వాధీనం చేసుకుంటామని తెలిపింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ ఉండొద్దంటూ ఓ ప్రకటనలో హెచ్చరించింది. కెనడాలోని భారత హై కమిషనర్ దినేష్ పట్నాయక్‌ను లక్ష్యంగా చేసుకుని పోస్టర్లను కూడా విడుదల చేసింది.
Also Read..
Love Swap | భార్య చెల్లితో భర్త పరార్.. బావ సోదరితో బామ్మర్ది జంప్
Modi Birthday | ప్రధాని నరేంద్ర మోదీకి బర్త్ డే విషెస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్
Diabetes | ధూమపానంతో టైప్-2 డయాబెటిస్!