ఇస్లామాబాద్: భారత దేశంలో ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కే జ్రీవాల్‌కు బెయిలు ఇచ్చారని పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ సు ప్రీంకోర్టుకు చెప్పారు. ఫిబ్రవరి 8న జరిగిన పాక్ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా నిరో ధించేందుకు ఐదు రోజుల్లోనే తనను దోషిగా తీర్పు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. 2022 ఏప్రిల్‌లో తాను పదవిని కోల్పోయానని, అప్పటి నుంచి తనను విపరీతంగా వేధిస్తు న్నారన్నారు. తనను అప్రకటిత మార్షల్ లా క్రింద అణగదొక్కుతున్నారని వాపోయారు. ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్‌ను నేషనల్ అకౌంటబిలిటీ ఆర్డినెన్స్‌కు సవరణలకు సంబంధించిన కేసులో విచారణ కోసం పాక్ సుప్రీంకోర్టులో గురువారం హాజరుపరిచారు.