Kate Middleton | బ్రిటన్ యువరాజు విలియం సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ (Princess of Wales) కేట్ మిడిల్టన్ (Kate Middleton) కీలక ప్రకటన చేశారు. తాను క్యాన్సర్ (Cancer) నుంచి బయటపడ్డట్లు వెల్లడించారు. ఈ మేరకు ఇన్ స్టా వేదికగా పోస్టు పెట్టారు. ఇప్పుడు చాలా ఉపశమనంగా ఉందని, ఇక నుంచి పూర్తిగా కోలుకోవడం పైనే దృష్టిసారించినట్లు తెలిపారు. అయితే సాధారణ స్థితికి రావడానికి ఇంకాస్త సమయం పడుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు విలియమ్‌తో కలిసి ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగులను పరామర్శించారు. గతేడాది చికిత్స సమయంలో ఆసుపత్రి సిబ్బంది తనను చాలా బాగా చూసుకున్నట్లు కేట్ మిడిల్టన్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ మేరకు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
తాను క్యాన్సర్ (Cancer)తో బాధపడుతున్నట్లు ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ (Princess of Wales) కేట్ మిడిల్టన్ (Kate Middleton) గతేడాది మార్చిలో ప్రకటించిన విషయం తెలిసిందే. అనారోగ్యం వల్ల జనవరిలో పొత్తికడుపు శస్త్రచికిత్స (abdominal surgery) చేయించుకున్నట్లు తెలిపారు. శస్త్రచికిత్స విజయవంతం అయినప్పటికీ ఆ తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో తనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు. ఇక అప్పటి నుంచి ఆమె బయటి ప్రపంచానికి కనిపించలేదు. పలు దశల వారీగా కీమోథెరపీ చేయించుకున్నారు.
Also Read..
“Kate Middleton | అదృశ్యం వార్తల వేళ.. క్యాన్సర్ బారినపడినట్లు ప్రకటించిన కేట్”
“Kate Middleton | అవన్నీ అవాస్తవాలే.. యువరాజు విలియంతో అఫైర్‌ను ఖండించిన సారా రోజ్”