Kate Middleton | అదృశ్యం వార్తల వేళ.. క్యాన్సర్ బారినపడినట్లు ప్రకటించిన కేట్
Kate Middleton | బ్రిటన్ యువరాజు విలియం (Prince William) సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ (Princess of Wales) కేట్ మిడిల్టన్ (Kate Middleton) క్యాన్సర్ బారినపడినట్లు వెల్లడైంది.
Kate Middleton | బ్రిటన్ రాజకుటుంబాన్ని క్యాన్సర్ (Cancer) మహమ్మారి వెంటాడుతోంది. ఇప్పటికే బ్రిటన్ రాజు ఛార్లెస్ 3 క్యాన్సర్ బారిన పడి చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే బ్రిటన్ యువరాజు విలియం (Prince William) సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ (Princess of Wales) కేట్ మిడిల్టన్ (Kate Middleton) కూడా ఈ వ్యాధి బారినపడ్డట్టు తాజాగా వెల్లడైంది. ఈ విషయాన్ని కేట్ స్వయంగా వెల్లడించారు.
తాను క్యాన్సర్ (Cancer)తో బాధపడుతున్నట్లు శుక్రవారం ఓ వీడియో ద్వారా కేట్ ప్రకటించారు. అయితే, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, రోజురోజుకూ బలపడుతున్నట్లు అందులో పేర్కొన్నారు. అనారోగ్యం వల్ల జనవరిలో పొత్తికడుపు శస్త్రచికిత్స (abdominal surgery) చేయించుకున్నట్లు తెలిపారు. శస్త్రచికిత్స విజయవంతం అయినప్పటికీ ఆ తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో తనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు. ‘ఈ విషయం తెలిసి నేను, నా భర్త, రాజ కుటుంబం షాక్‌కు గురయ్యాం. నా మెడికల్ టీం సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నాను. ఈ ట్రీట్మెంట్ ప్రస్తుతం తొలి దశలో ఉంది. నా వద్ద అద్భుతమైన వైద్య బృందం ఉంది. వారు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. దానికి నేను చాలా కృతజ్ఞురాలిని. ప్రస్తుతం నా ఆరోగ్యం మెరుగుపడుతోంది’ అని కేట్ వివరించారు. మరోవైపు ఈస్టర్ తర్వాతే కేట్ తన రాచరిక విధుల్లో పాల్గొంటారని రాజభవనం ఓ ప్రకటనలో తెలిపింది.
మరోవైపు బ్రిటన్ రాజు చార్లెస్ 3 (King Charles) కూడా ఇటీవలే క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ జనవరిలో ప్రకటించింది. కేట్కు శస్త్రచికిత్స జరిగిన ఆసుపత్రిలోనే రాజు కూడా ప్రొస్ట్రేట్ గ్రంధి సమస్యకు ట్రీట్మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం చార్లెస్ క్రమంగా కోలుకుంటున్నట్లు రాజకుటుంబం తెలిపింది.
కేట్ పొత్తికడుపు శస్త్రచికిత్స (abdominal surgery) చేయించుకున్నారని, ప్రస్తుతం ఇంట్లో కోలుకుంటున్నారంటూ ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కార్యాలయం జనవరిలో వెల్లడించింది. అయితే, అప్పటి నుంచి ఆమె బాహ్యప్రపంచానికి కనిపించనేలేదు. అధికారిక కార్యక్రమాల్లో కూడా యువరాజు విలియం ఒక్కరే పాల్గొంటూ వస్తున్నారు. రెండు నెలలైనా కేట్ ఎక్కడా కనిపించకపోవడంతో ఆమె చుట్టూ ఎన్నో కథనాలు వినిపించాయి. శస్త్రచికిత్స అనంతరం కేట్ కోమాలోకి వెళ్లిపోయిందంటూ ప్రచారం జరిగింది. ఇదే సమయంలో యువరాజు విలియంకు అతని స్నేహితురాలు 40 ఏళ్ల సారా రోజ్ హాండ్బరీ (Sarah Rose Hanbury)తో అఫైర్ ఉందంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో తన అదృశ్యంపై తాజాగా కేట్ స్పష్టతనిచ్చినట్లైంది.
View this post on Instagram
A post shared by The Prince and Princess of Wales (@princeandprincessofwales)
Also Read..
“Kate Middleton | అవన్నీ అవాస్తవాలే.. యువరాజు విలియంతో అఫైర్‌ను ఖండించిన సారా రోజ్”
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

