Kate Middleton | మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచిన కేట్.. క్యాన్సర్ ప్రకటన వీడియో ఫేక్ అంటూ ప్రచారం
Kate Middleton | బ్రిటన్ యువరాజు విలియం సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ (Princess of Wales) కేట్ మిడిల్టన్ (Kate Middleton) మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచారు.
Kate Middleton | బ్రిటన్ యువరాజు విలియం సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ (Princess of Wales) కేట్ మిడిల్టన్ (Kate Middleton) మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచారు. గత మూడు నెలలుగా కేట్ బాహ్యప్రపంచానికి కనిపించడం లేదన్న విషయం తెలిసిందే. దీంతో ఆమె చుట్టు ఎన్నో కథనాలు వినిపించాయి. పొత్తి కడుపు ఆపరేషన్ అనంతరం కేట్ కోమాలోకి వెళ్లిపోయిందంటూ ప్రచారం జరిగింది. అయితే, వాటన్నింటికీ చెక్‌పెడుతూ.. కేట్ గత శుక్రవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసింది. తనకు క్యాన్సర్ నిర్ధారణ అయ్యిందని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
అయితే, ఇప్పుడు ఆ వీడియో కూడా ఫేక్ అనే వాదన వినిపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artifical Intelligence) సాయంతో వీడియోను రూపొందించారంటూ ప్రచారం జరుగుతోంది. వీడియోలో కేట్ బ్లాక్ అండ్ వైట్ టీషర్ట్, బ్లూ జీన్స్ ధరించి లూజ్ హెయిర్‌తో గార్డెన్లో బెంచ్‌పై కూర్చొని కనిపించింది. అయితే, కేట్ వెనకున్న గడ్డి, పూల మొక్కలు ఎందుకు గాలికి కదలడం లేదు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో ఏఐ ఆధారిత ఫేక్ వీడియో (AI generated) అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కేట్ అదృశ్యం
అనారోగ్యం వల్ల కేట్ పొత్తికడుపు శస్త్రచికిత్స (abdominal surgery) చేయించుకున్నారని, ప్రస్తుతం ఇంట్లో కోలుకుంటున్నారంటూ ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కార్యాలయం జనవరిలో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆమె బయట ఎక్కడా కనిపించలేదు. అధికారిక కార్యక్రమాల్లో కూడా యువరాజు విలియం ఒక్కరే పాల్గొంటూ వస్తున్నారు. దీంతో కేట్ చుట్టూ ఎన్నో కథనాలు వినిపించాయి. శస్త్రచికిత్స అనంతరం కేట్ కోమాలోకి వెళ్లిపోయిందంటూ ప్రచారం జరిగింది. ఇదే సమయంలో యువరాజు విలియంకు అతని స్నేహితురాలు 40 ఏళ్ల సారా రోజ్ హాండ్బరీ (Sarah Rose Hanbury)తో అఫైర్ ఉందంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో గత శుక్రవారం కేట్ ఓ వీడియో సందేశం ద్వారా తాను క్యాన్సర్ బారిన పడినట్లు వెల్లడించారు.
క్యాన్సర్ బారినపడినట్లు ప్రకటించిన కేట్
అయితే, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, రోజురోజుకూ బలపడుతున్నట్లు అందులో పేర్కొన్నారు. అనారోగ్యం వల్ల జనవరిలో పొత్తికడుపు శస్త్రచికిత్స (abdominal surgery) చేయించుకున్నట్లు తెలిపారు. శస్త్రచికిత్స విజయవంతం అయినప్పటికీ ఆ తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో తనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు. ‘ఈ విషయం తెలిసి నేను, నా భర్త, రాజ కుటుంబం షాక్‌కు గురయ్యాం. నా మెడికల్ టీం సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నాను. ఈ ట్రీట్మెంట్ ప్రస్తుతం తొలి దశలో ఉంది. నా వద్ద అద్భుతమైన వైద్య బృందం ఉంది. వారు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. దానికి నేను చాలా కృతజ్ఞురాలిని. ప్రస్తుతం నా ఆరోగ్యం మెరుగుపడుతోంది’ అని కేట్ వివరించారు. మరోవైపు ఈస్టర్ తర్వాతే కేట్ తన రాచరిక విధుల్లో పాల్గొంటారని రాజభవనం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఇప్పుడు ఆ వీడియోపై నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram
A post shared by The Prince and Princess of Wales (@princeandprincessofwales)
Also Read..
“Kate Middleton | అదృశ్యం వార్తల వేళ.. క్యాన్సర్ బారినపడినట్లు ప్రకటించిన కేట్”
“Kate Middleton | అవన్నీ అవాస్తవాలే.. యువరాజు విలియంతో అఫైర్‌ను ఖండించిన సారా రోజ్”
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

