Kamala Harris | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి (Republican presidential candidate) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గెలుపు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. మెజారిటీ మార్క్ 270కి కేవలం మూడు ఓట్ల దూరంలో ట్రంప్ ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో మెజారిటీ మార్కు 270. ఇప్పటి వరకూ వెల్లడైన ఫలితాల్లో ట్రంప్ 267 ఎలక్టోరల్ ఓట్లతో దూసుకెళ్తున్నారు. ఇక డెమోక్రటిక్ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మాత్రం కేవలం 214 ఓట్ల వద్దే కొనసాగుతున్నారు. దీంతో ట్రంప్ మద్దతుదారులు సంబరాలు మొదలు పెట్టేశారు.
ఇక విక్టరీ నేపథ్యంలో మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఓటమి నేపథ్యంలో కమలా హారిస్ తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు (Harris Cancels Speech). కమలా హారిస్ ఎలక్షన్ నైట్ హార్వర్డ్ యూనివర్సిటీ వాచ్ పార్టీలో ప్రసంగించాల్సి ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నారు. ఆమె రేపు మాట్లాడతారని కమలా హారిస్ ప్రచార బృందం తాజాగా ప్రకటించింది.
Also Read..
Donald Trump: స్వింగ్ స్టేట్స్లో ట్రంప్ షో.. ఇది అసాధారణ రాజకీయ ఘనతే !
Donald Trump | విజయం దిశగా ట్రంప్.. సెలబ్రేషన్స్ మూడ్లో మద్దతుదారులు
US Senate: రిపబ్లికన్ల ఆధీనంలోకి సేనేట్..