బుధవారం 03 జూన్ 2020
International - Apr 04, 2020 , 18:49:36

కాబూల్ గురుద్వారా దాడి సూత్రధారి అరెస్ట్

కాబూల్ గురుద్వారా దాడి సూత్రధారి అరెస్ట్

హైదరాబాద్: కాబూల్ గురుద్వారాపై ఉగ్రదాడి సూత్రధారి మౌలావీ అబ్దుల్లా అలియాస్ అస్లం ఫరూకీని ఆఫ్ఘనిస్థాన్ భద్రతా దళాలు శనివారం అరెస్టు చేశాయి. 27 మంది అమాయక సిక్కులు ఈ ఉగ్రదాడిలో హతులయ్యారు. వారిలో భారత జాతీయుడైన తిహాన్‌సింగ్ కూడా ఉన్నాడు. ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ ప్రావిన్స్ అమీర్ గా చెప్పుకునే మౌలావీని ఆఫ్ఘన్ జాతీయ భద్రతా డైరెక్టరేట్ ప్రశ్నించనున్నది. ఉగ్రదాడి కుట్ర ఆరోపణలపై ఈ అరెస్టు జరిగినట్టు అదికార వర్గాలు తెలిపాయి. అమాయక సిక్కులపై ఉగ్రదాడికి ఎవరు ఆదేశించారు, దాడి వెనుక పాక్ పాత్ర ఏమిటి, దాడిలో ఎవరెవరు పాల్గొన్నారు.. మొదలైన ప్రశ్నలకు మౌలావీ నుంచి స మాధానాలు రాబడుతారని అనుకుంటున్నారు. పాక్ జాతీయుడైన మౌలావీ ఇదివరకు లష్కరే తాయిబా, తెహరీక్ తాలిబన్ సంస్థలలో పనిచేశాడు.


logo