ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అధినేత అయ్మన్ అల్‌జవహరి హతమయ్యాడు. అమెరికా బలగాలు చేసిన దాడిలో అతను మరణించినట్లు అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. కాబూల్‌పై చేసిన ఎయిర్‌స్ట్రైక్స్‌లో అల్‌జవహరి హతమైనట్లు అగ్రరాజ్యం ప్రకటించింది.
న్యాయం జరిగిందని, ఈ ఉగ్రవాద నేత ఇక లేడని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. ‘‘అల్‌ఖైదా నేత అల్‌జవహరి హతమయ్యాడు. అమెరికా ప్రజలకు హాని కలిగిస్తే ఎక్కడున్న వదలం. ఎంతకాలమైనా ఎక్కడ దాక్కున్నా మట్టుబెడతాం’’ అని బైడెన్ వార్నింగ్ ఇచ్చారు.
I’m addressing the nation on a successful counterterrorism operation. https://t.co/SgTVaszA3s
— President Biden (@POTUS) August 1, 2022