Japan Airlines | జపాన్ ఎయిర్లైన్స్ (Japan Airlines)పై సైబర్ దాడి (cyberattack) జరిగింది. దీంతో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. టికెట్ల బుకింగ్ సేవలు నిలిచిపోయాయి (ticket sales halted). ఎయిర్పోర్ట్స్లో బ్యాగేజీ చెక్-ఇన్ సిస్టమ్లో కూడా సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని జపాన్ ఎయిర్లైన్స్ సంస్థ వెల్లడించింది.
గురువారం ఉదయం 7:24 గంటల నుంచి దేశీయ, అంతర్జాతీయ నెట్వర్క్లలో సమస్యలను గుర్తించినట్లు పేర్కొంది. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. ప్రయాణికులకు కలిగి అసౌకర్యానికి ఈ సందర్భంగా ఎయిర్లైన్స్ క్షమాపణలు తెలియజేసింది. కాగా.. జపాన్ ఎయిర్లైన్స్ ఆ దేశంలోనే రెండో అతిపెద్ద విమానయాన సంస్థ. ప్రస్తుతం సైబర్ దాడి కారణంగా ఈ సంస్థకు చెందిన పలు విమానాలు ఆలస్యంగా (flights delayed) నడుస్తున్నాయి.
Also Read..
Quantum Sensor | క్వాంటమ్ సెన్సర్ పనితీరును మెరుగుపరిచే ద్రాక్ష పండ్లు
Indian Migrants | అమెరికా వయా కెనడా.. భారతీయుల అక్రమ రవాణా