Indian Migrants | అమెరికా వయా కెనడా.. భారతీయుల అక్రమ రవాణా
మానవ అక్రమ రవాణా కేసులో కొన్ని కెనడా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, భారత్‌కు చెందిన సంస్థల పాత్రపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుపుతున్నది. కెనడా నుంచి మన పౌరులను అమెరికాలోకి పంపేందుకు కొన్ని ముఠాలు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయి.
- కెనడా విద్యాసంస్థల సహకారం
- భారత్‌లోని ముఠాలపై ఈడీ దర్యాప్తు
Indian Migrants | న్యూఢిల్లీ, డిసెంబర్ 25 : మానవ అక్రమ రవాణా కేసులో కొన్ని కెనడా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, భారత్‌కు చెందిన సంస్థల పాత్రపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుపుతున్నది. కెనడా నుంచి మన పౌరులను అమెరికాలోకి పంపేందుకు కొన్ని ముఠాలు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయి. కెనడా-అమెరికా సరిహద్దును అక్రమంగా దాటడానికి ప్రయత్నిస్తుండగా తీవ్రమైన చలికి తట్టుకోలేక గుజరాత్‌లోని డింగుచ గ్రామానికి చెందిన ఒక కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు 2022 జనవరి 19న మృతి చెందారు.
దీనిపై అహ్మదాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ను పరిగణనలోకి తీసుకున్న ఈడీ భవేశ్ అశోక్ పటేల్, కొన్ని భారత సంస్థలపై మనీలాండరింగ్ కేసు పెట్టింది. ఈడీ వెల్లడించిన వివరాల ప్రకారం… ఈ దళారీ ఏజెన్సీలు అమెరికా వెళ్లాలనుకునే వారికి, అమెరికాలో కాకుండా.. కెనడాలోని కొన్ని విద్యాసంస్థలు, యూనివర్సిటీలలో ప్రవేశాలకు ఏర్పాట్లు చేస్తాయి. కెనడా వీసా వచ్చిన వెంటనే వారు ఆయా విద్యాసంస్థల్లో చేరకుండా అక్రమంగా యూఎస్-కెనడా సరిహద్దు ద్వారా అమెరికా వలసదారులుగా వెళ్లిపోతారు. తర్వాత కెనడాలోని ఆయా విద్యాసంస్థలు కొంత సొమ్ము మినహాయించుకుని విద్యార్థులకు వారు కట్టిన ఫీజును వాపసు చేస్తాయి. ఇలా చేసినందుకు ఆయా ముఠాలు విద్యార్థులు ఒక్కొక్కరి నుంచి రూ.55-60 లక్షలు వసూలు చేస్తున్నాయి. ఇలా ముంబైలో ఒక సంస్థ ప్రతి సంవత్సరం 25 వేల మంది, మరో సంస్థ 10 వేల మందిని అమెరికా పంపినట్టు ఈడీ వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

