Doctored Pictures | మార్ఫింగ్ ఫొటోలు (Doctored Pictures) ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. సామాన్యులతోపాటూ సెలబ్రిటీల ఫొటోలు కూడా కొందరు అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేసి పోర్నోగ్రఫీ వెబ్సైట్లలో (pornographic website) అప్లోడ్ చేస్తున్నారు. తాజాగా ఇటలీ (Italy)లో మార్ఫింగ్ పొటోల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఏకంగా ఆ దేశ ప్రధాని (Italy PM) జార్జియా మెలోనీ (Giorgia Meloni) ఫొటోలనే మార్ఫింగ్ చేసి పోర్న్సైట్లో అప్లోడ్ చేయడం చర్చకు దారి తీసింది.
ఇటలీ ప్రధాన మంత్రి మెలోని సహా ఆమె సోదరి, ఆ దేశంలోని ప్రముఖ మహిళా నేతలకు చెందిన మార్ఫింగ్ ఫొటోలు ‘ఫికా’ (Phica) అనే పోర్నోగ్రఫీ వెబ్సైట్లో దర్శనమిచ్చాయి. మార్ఫింగ్ చేసిన ఫోటోలతో వీడియోలను రూపొందించి అప్లోడ్ చేశారు. ఈ వెబ్‌సైట్‌కి దాదాపు 700,000 కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ వ్యవహారం ఆ దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై ప్రధాని మెలోనీ తీవ్రంగా స్పందించారు. తన ఫొటోలు, ఇతర మహిళలకు సంబంధించిన చిత్రాలను అశ్లీల వెబ్సైట్లో ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను అసహ్యకరమైన చర్యగా అభివర్ణించారు. అంతేకాదు, నేరస్థులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
‘జరిగిన ఘటన పట్ల నాకు అసహ్యం వేస్తోంది. ఈ చర్య ద్వారా అవమానానికి, హింసకు గురైన మహిళలందరికీ నా పూర్తి సంఘీభావం, మద్దతు ఉంటుంది. 2025లో కూడా ఒక మహిళ గౌరవాన్ని కించపరచడం దారుణం. అజ్ఞాతంలో ఉండి మహిళలను లైంగిక, అశ్లీల దూషణలతో దాడి చేయడం బాధాకరం. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాం. త్వరలోనే నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తాం’ అని మెలోనీ తెలిపారు.
Also Read..
Ishaq Dar | భారత్‌తో చర్చలకు సిద్ధం.. పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్
PM Modi | బుల్లెట్ రైల్లో ప్రయాణించిన ప్రధాని మోదీ.. VIDEO
Trump Tariffs | సుంకాల పెంపు రాజ్యాంగ విరుద్ధం.. ట్రంప్‌కు ఆ హక్కులేదన్న యూఎస్ కోర్టు