Hamas Attack | హమాస్ దాడిని 9/11తో పోల్చిన ఇజ్రాయెల్ రాయబారి
ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్ర సంస్ధ హమాస్ దాడిని (Hamas Attack) ఐక్యరాజ్యసమితి ఇజ్రాయెల్ రాయబారి ఖండిస్తూ ఈ దాడిని అమెరికాలో జరిగిన 9/11 ఉగ్రదాడిగా అభివర్ణించారు.
న్యూయార్క్ : ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్ర సంస్ధ హమాస్ దాడిని (Hamas Attack) ఐక్యరాజ్యసమితి ఇజ్రాయెల్ రాయబారి ఖండిస్తూ ఈ దాడిని అమెరికాలో జరిగిన 9/11 ఉగ్రదాడిగా అభివర్ణించారు. ఇక్కడ అమెరికాలో మరణించిన 50,000 మంది తరహాలో తామిప్పటికే 1500 మంది ప్రాణాలను కోల్పోయామని ఇజ్రాయెల్ అత్యున్నత దౌత్యవేత్త గిలాద్ ఎర్డాన్ పేర్కొన్నారు.
ఉగ్రసంస్ధ అమాయక పౌరులను చంపడాన్ని తీవ్రంగా ఖండించిన ఎర్డాన్ ఉగ్రవాదులను జంతువులతో సమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులు, మహిళలు, పౌరులను వారి ఇండ్ల నుంచి బయటకు తీసుకువచ్చి బందీలుగా చేశారని, బహిరంగంగా కాల్చివేస్తూ ఊచకోతకు పాల్పడ్డారని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలకు హమాస్ పూర్తి బాధ్యత వహించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.
తమ పౌరులను, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు ఇజ్రాయెల్ దీటుగా ప్రతిస్పందిస్తుందని భద్రతా మండలికి రాసిన లేఖలో ఎర్డాన్ తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్, పాలస్తీనా ఉగ్రవాద సంస్ధ హమాస్‌ల మధ్య పలు ప్రాంతాల్లో భీకర దాడులు కొనసాగుతున్నాయి.
Read More :
Nushrat Bharucha | ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన బాలీవుడ్ నటి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

