గాజా స్ట్రిప్, ఏప్రిల్ 19: గాజాపై ఇజ్రాయెల్ తన దాడులను కొనసాగిస్తూనే ఉంది. గత 48 గంటల్లో ఇజ్రాయెల్ దళాలు పెద్దయెత్తున జరిపిన దాడుల్లో 90 మంది మరణించినట్టు గాజా ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. మృతుల్లో 15 మంది మహిళలు, పిల్లలు ఉన్నట్టు తెలిపింది.
కాగా, హమాస్ నిరాయుధీకరణ, తమ బందీల విడుదల కోసం ఇటీవల ఇజ్రాయెల్ గాజాలో దాడులను ఉధృతం చేసింది. పెద్దయెత్తున సెక్యూరిటీ జోన్లను ఆక్రమించుకోవాలన్నది ఇజ్రాయెల్ ప్రస్తుత ప్రణాళిక.