Israeli strikes | కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ (ceasefire) పాలస్తీనాపై ఇజ్రాయెల్ దళాలు మరోసారి దాడులకు పాల్పడ్డాయి (Israeli strikes). గాజా (Gaza) నగరాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేశాయి. గాజా, ఖాన్ యూనిస్‌పై క్షిపణుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో దాదాపు 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రముఖ వార్తా సంస్థ అల్ జజీరా తెలిపింది. సుమారు 77 మంది గాయపడినట్లు వెల్లడించింది. ఐడీఎఫ్ దాడులు జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను తాకాడంతో ప్రాణనష్టం అధికంగా ఉన్నట్లు తెలిపింది. హమాస్ ఉగ్రవాదులు తమ దేశంపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించడంతోనే స్ట్రైక్స్ చేసినట్లు ఇజ్రాయెల్ మిటిలరీ వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. లెబనాన్ (Lebanon)పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. దక్షిణ లెబనాన్‌లోని పాలస్తీనా శరణార్థి శిబిరంపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 10 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు లెబనీస్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ అల్ జజీరా నివేదించింది. హమాస్, హెజ్బొల్లా నెట్వర్క్లే లక్ష్యంగా ఈ వైమానిక, డ్రోన్ దాడులు నిర్వహిస్తున్నామని ఇజ్రాయెల్ పేర్కొంది. కాగా, అమెరికా మధ్యవర్తిత్వంతో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణను ధిక్కరించి గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వరుస దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకూ 393 దాడులు చేసినట్లు అల్ జజీరా నివేదించింది. ఈ దాడుల్లో దాదాపు 280 మంది మరణించారు. సుమారు 672 మంది గాయపడ్డారు.
Also Read..
Epstein files | సెక్స్ కుంభకోణంలో ట్రంప్ ఫ్యామిలీ.. ఇంకా ఎవరెవరి పేర్లు ఉన్నాయంటే
NASA | అంగారకుడిపై మిస్టీరియస్ ఏలియన్ రాక్‌ను గుర్తించిన నాసా..!