జెరూసలెం : ఇరాన్‌పై దాడులకు అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రపంచ దేశాల నేతలతో మాట్లాడుతున్నారు. నెతన్యాహూ గురువారం రాత్రి నుంచి వివిధ దేశాల నేతలతో మాట్లాడుతున్నారు.
ప్రధాని మోదీ, జర్మన్ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ తదితరులతో మాట్లాడారు. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్‌కు ఎదురవుతున్న ముప్పును ఈ నేతలు అర్థం చేసుకున్నట్లు నెతన్యాహు కార్యాలయం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ నెతన్యాహూ మాట్లాడతారని చెప్పింది.