Israel-Hamas War | పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) దాడులతో ఇజ్రాయెల్ (Israel) ఉక్కిరిబిక్కిరవుతోంది. దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాలూ దద్దరిల్లుతున్నాయి. తమ దేశంపై హమాస్ (Hamas) చేపట్టిన దాడులను ఇజ్రాయెల్ (Israel) ధీటుగా ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగా మిలిటెంట్ల పాలనలో ఉన్న గాజా (Gaza)పై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో రాత్రికి రాత్రే గాజాలోని 200 మిలిటెంట్ స్థావరాలపై దాడులు చేసింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (The Israeli Air Force) తాజాగా ప్రకటించింది.
‘గాజాలోని 200 మిలిటెంట్ స్థావరాలపై నిన్న రాత్రి దాడులు చేశాం. మిలిటెంట్లు ఆయుధాలు దాచిన ఓ ప్రార్థనా మందిరం, ఒక అపార్ట్మెంట్ భవనాన్ని కూడా కూల్చేశాం. పలు సైనిక లక్ష్యాలను కూడా ధ్వంసం చేశాం’ అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది. మరోవైపు పాలస్తీనా వాసులు గాజాను తక్షణమే ఖాళీ చేసి అక్కడి నుంచి వీలైనంత త్వరగా వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం సూచించింది.
Over the last few hours, IAF fighter jets have been striking numerous terror targets belonging to terrorist organizations in the Gaza Strip.
Overnight, dozens of fighter jets struck over 200 targets in Rimal and Khan Yunis. pic.twitter.com/ZxLY4xnmn0
— Israeli Air Force (@IAFsite) October 10, 2023
Also Read..
Israel-Hamas War | హమాస్ మిలిటెంట్లను ఏరిపారేస్తున్న ఇజ్రాయెల్ పోలీసులు.. వీడియో
Israel-Hamas War | హమాస్ దాడులతో ఇజ్రాయెల్ ఉక్కిరిబిక్కిరి.. వ్యవసాయ పొలంలో 100 మృతదేహాలు లభ్యం