హైదరాబాద్, ఆట ప్రతినిధి: స్పెయిన్ వేదికగా జరిగిన రోక్విటాస్ చెస్ ఫెస్టివెల్ టోర్నీలో తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ ఉప్పల ప్రణీత్ టైటిల్ విజేతగా నిలిచాడు. వివిధ దేశాల నుంచి 151 మంది ప్లేయర్లు పోటీపడ్డ టోర్నీలో ప్రణీత్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
టోర్నీలో ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన ఈ యువ జీఎం ఏడు విజయాలు ఒక డ్రాతో మొత్తం 7.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ఇదే టోర్నీలో మారిన్ ప్రిగట్(స్పెయిన్), కురోవ్స్కీ ఫిలిప్(పోలాండ్) వరుసగా రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నారు.