టెల్ అవీవ్, సెప్టెంబర్ 27: ఇజ్రాయెల్ జరిపిన దాడులు, కాల్పుల్లో గాజాలో 44 మంది పౌరులు మరణించారని ఆరోగ్య శాఖ అధికారులు శనివారం తెలిపారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఉన్నారన్నారు.
ఇజ్రాయెల్ నరమేధంలో ఇప్పటివరకు గాజాలో 65 వేల మంది మృతి చెందగా, 1,67,000 మంది గాయపడినట్టు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. ఒక వైపు కాల్పుల విరమణకు తీవ్ర ఒత్తిడి వస్తున్నప్పటికీ గాజాలో ఇజ్రాయెల్ తన దాడులను కొనసాగిస్తూనే ఉంది.