Israeli airstrikes | గాజా (Gaza)పై ఇజ్రాయెల్ (Israel) భీకర దాడులకు పాల్పడింది. మంగళవారం రాత్రి వైమానిక (Israeli airstrikes) దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 50 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారుజామున ఉత్తర గాజాలోని ఇళ్లపై ఇజ్రాయెల్ ఫోర్స్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో కనీసం 48 మంది మరణించినట్లు జబాలియాలోని ఇండోనేషియా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో 22 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపాయి. మరోవైపు గాజాలో యుద్ధాని ఆపడానికి ఎలాంటి మార్గం లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ పర్యటన వేళ ఈ దాడులు జరగడం గమనార్హం.
Also Read..
Donald Trump | ఉద్రిక్తతలు తగ్గేందుకు భారత్-పాక్ దేశాలు డిన్నర్ చేసుకోవాలి : డొనాల్డ్ ట్రంప్
Vijay Shah | కల్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన మధ్యప్రదేశ్ మంత్రి