Israel | ఇరాన్ పౌరులకు ఇజ్రాయెల్ హెచ్చరిక.. 12 గంటలపాటు రైళ్లకు దూరంగా ఉండాలని సూచన
Israel : ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఇంకా తీవ్రమవుతోంది. ఇరాన్‌పై మరిన్ని భీకర దాడులకు ఇరు దేశాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ ఒక హెచ్చరిక జారీ చేసింది.
Israel : ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఇంకా తీవ్రమవుతోంది. ఇరాన్‌పై మరిన్ని భీకర దాడులకు ఇరు దేశాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ ఒక హెచ్చరిక జారీ చేసింది. రైల్వే వ్యవస్థలకు, రైళ్లకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా 12 గంటలపాటు రైళ్లలో ప్రయాణించకపోవడమే మంచిదని సూచించింది. స్థానిక కాలమానం ప్రకారం ఇప్పటి నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇరాన్‌లోని ఏ రైళ్లలో అయినా ప్రయాణించడం మానేయండి అని ప్రజల్ని హెచ్చరిస్తూ ఎక్స్‌లో ఇజ్రాయెల్ మిలిటరీ ఒక ప్రకటన జారీ చేసింది.
వారి భద్రత కోసమే ఈ వార్నింగ్ ఇస్తున్నట్లు తెలిపింది. రైళ్లలో లేదా రైల్వే లైన్ల సమీపంలో ఉంటే ప్రాణాలకు ముప్పు తప్పదని హెచ్చరించింది. ఇజ్రాయెల్ ఇరాన్‌పై సోమవారం భారీ దాడులు నిర్వహించింది. అసలుయేహ్లోని పెట్రో కెమికల్ స్థావరాలపై దాడి చేసింది. ఇరాన్‌కు అవసరమైన చమురులో 50 శాతం అందించే స్థావరంపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇది దేశంలోనే అతిపెద్ద చమురు స్థావరం. దక్షిణ పర్స్ గ్యాస్ ఫీల్డ్‌పై దాడి జరిగినట్లు ఇరాన్ మీడియా కూడా ధృవీకరించింది. ఈ ప్రదేశంపై దాడి జరగడం అంటే ఇరాన్‌కు భారీ ఆర్థిక నష్టం కలిగినట్లే. దీని విలువ వందల కోట్ల డాలర్లు ఉంటుందని ఇజ్రాయెల్ తెలిపింది. గతవారం కూడా మరో పెట్రో స్థావరంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ రెండు చమురు స్థావరాలు ఇరాన్లో 85 శాతం ఆయిల్ అందిస్తాయి.
ఈ రెండింటి వల్ల ఇప్పుడు ఇరాన్‌లోనూ సంక్షోభం తలెత్తింది. మరోవైపు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. సౌదీ, బహ్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై ఇరాన్ దాడి చేసింది. ఒక సౌదీని, బహ్రెయిన్‌ను కలిపే రోడ్డును సౌదీ మూసేసింది. మరోవైపు హార్ముజ్ జలసంధిని తెరవాలని ట్రంప్ విధించిన గడువు కూడా నేటితో పూర్తవుతుంది. రాత్రి 8 గంటలలోపు హార్ముజ్ తెరవకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించిన సంగతి తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

