టెల్ అవీవ్, ఆగస్టు 22 : హమాస్ కనుక తమ షరతులకు అంగీకరించకపోతే వారికి నరకం తప్పదని, గాజా.. మరో రఫా, బీట్ హనౌన్గా మారుతుందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ శుక్రవారం హెచ్చరించారు. గాజాని స్వాధీనం చేసుకోవడానికి సైన్యానికి అధికారిక అనుమతి ఇస్తానని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటన చేయడంతో..
ముట్టడించిన గాజా నగరంపై ఇజ్రాయెల్ మిలిటరీ దళాలు భారీ సైనిక దాడికి సిద్ధమవుతున్న క్రమంలో ఆయనీ హెచ్చరిక చేశారు. హమాస్ ఆయుధాలు విడిచిపెట్టకపోతే గాజాను నాశనం చేస్తామని హెచ్చరిస్తూ.. హమాస్ తమ దారికి రాకపోతే గాజా విధ్వంసం తప్పదని, వారికి నరక దారులు తెరుచుకుంటాయని స్పష్టంచేశారు.