టెల్ అవీవ్: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను హమాస్ ఇజ్రాయెల్‌కు అప్పగిస్తుంది.
అదేవిధంగా, తమ జైళ్లలో ఉన్న పాలస్తీనీయులను ఇజ్రాయెల్ విడుదల చేస్తుంది. ఈ గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తి స్థాయి క్యాబినెట్ ఆమోదం కోసం పంపిస్తారు. బందీల్లో తొలి బృందాన్ని ఆదివారం విడుదల చేయడంతో ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది.