న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ (Israel), లెబనాన్ (Lebanon) మధ్య మరోసారి తీవ్ర ఉద్రీక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఇరు దేశాలు పరస్పరం వైమానిక దాడులకు (Air strikes) పాల్పడ్డాయి. గురువారం అర్ధరాత్రి పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌పై (Gaza Strip) ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులకు పాల్పడింది. లెబనాన్ నుంచి హమాస్ (Hamas) తీవ్రవాదులు తమ దేశంపై రాకెట్లతో దాడులకు పాల్పడంతోనే తాము వైమానిక దాడులు చేసినట్లు తెలిపింది. 2006 తర్వాత గాజాపై ఇంతపెద్ద ఎత్తున ఇజ్రాయెల్ దాడులకు పాల్పడటం ఇదే మొదటిసారి.
ఇటీవల జెరూసలెంలోని అల్-అక్సా మసీదులో (Jerusalem’s Al-Aqsa Mosque) పాలస్తీయన్లతో (Palestinians) ఇజ్రాయెల్ పోలీసులు ఘర్షణకు దిగారు. దీనితర్వాత ఇజ్రాయెల్‌పై దాడులు జరిగాయి. లెబనాన్ భూభాగం నుంచి 34 రాకెట్లతో తమ దేశంపైకి దాడికి పాల్పడినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. అయితే వాటిలో 25 రాకెట్లను తమ రక్షణ వ్యవస్థ అడ్డుకున్నదని, మరో ఐదు ఇజ్రాయెల్ భూభాగంలో పడినట్లు పేర్కొన్నది. హమాస్ చర్యకు ప్రతిస్పందనగా వారికి చెందిన రెండు సొరంగాలు, రెండు ఆయుధ తయారీ స్థలాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. లెబనాన్ చర్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మాట్లాడుతూ.. బాధ్యులు తగిన మూల్యం చెల్లించుకుంటారని ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే గాజా స్ట్రిప్‌పై దాడులు జరగడం విశేషం.