టెల్ అవీవ్: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నట్టు మీడియా కథనాలు వెలువరించాయి. తమ తదుపరి లక్ష్యంగా ఆయన మారవచ్చునని ఒక సీనియర్ అధికారి వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు తెలిపారు. ఇరాన్ స్వచ్ఛందంగా తన అణు కార్యక్రమాన్ని తొలగించుకునే వరకు లేదా దానిని ఇరాన్ పునర్నిర్మించుకోవడం అసాధ్యంగా మారినప్పుడు మాత్రమే ఈ సంక్షోభానికి తెర పడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హత్య చేయాలనే ఇజ్రాయెల్ ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీటో చేశారని ఇద్దరు అమెరికా అధికారులు తెలిపారు. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ప్రశ్నించగా తాను దానిలోకి వెళ్లబోవడం లేదని తెలిపారు. ఇరాన్‌పై దాడుల గురించి అమెరికాకు ముందస్తు సమాచారం అందజేసినట్టు ఆయన తెలిపారు.