Israel-Iran | ఇజ్రాయెల్ (Israel), ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్నది. వరుసగా ఐదో రోజు కూడా ఇరు దేశాలు పరస్పరం భీకర దాడులకు దిగాయి. తాజాగా టెహ్రాన్ ఎయిర్పోర్ట్ (Tehran airport)పై ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్‌కు చెందిన రెండు F-14 యుద్ధ విమానాలు (F -14 fighter jets) ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోని ఐడీఎఫ్ దళాలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాయి. ఇజ్రాయెల్ విమానాలను అడ్డుకునేందుకు టెహ్రాన్ వీటిని ఎయిర్‌పోర్ట్‌లో సిద్ధంగా ఉంచినట్లు పేర్కొంది. తమ దాడిలో ఆ ఫైటర్ జెట్స్ పూర్తిగా ధ్వంసమైనట్లు వెల్లడించింది.
RECAP of Our Recent Operations Over Tehran:
🛫 Strike on two F-14 fighter jets that were located at an airport in Tehran. These jets were intended to intercept Israeli aircraft.
❌ Thwarted a UAV launch attempt toward Israel.
🎯 Eliminated a launch cell minutes before launch… pic.twitter.com/y1gY7oBz99
— Israel Defense Forces (@IDF) June 16, 2025
మరోవైపు, తమ లక్ష్యాలు ఇంకా పూర్తి కానందున ఇరాన్‌లోని ఆయుధాగారాల సమీపంలోని ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాలని ఇజ్రాయెల్ తాజాగా హెచ్చరించింది. ఇరాన్‌తో సైనిక ఘర్షణలు ప్రారంభమైన నాలుగవ రోజు సోమవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్ గగనతలంపై తమకు పట్టు చిక్కిందని ఇజ్రాయెలీ సైన్యం ప్రకటించింది. ఏ విధమైన సవాళ్లు లేకుండా టెహ్రాన్ గగనతలంపై తమ యుద్ధ విమానాలు విహరించగలవని ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్‌పై తమపై జరిపిన క్షిపణి, డ్రోన్ల దాడిలో ఇప్పటి వరకు 24 మంది మరణించగా 500 మందికిపైగా గాయపడ్డారని ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్‌కు చెందిన 120కి పైగా క్షిపణులను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది.
Also Read..
China | టెహ్రాన్, టెల్ అవీవ్‌ను సాధ్యమైనంత త్వరగా వీడండి.. తమ పౌరులకు చైనీస్ ఎంబసీ అడ్వైజరీ
క్షిపణుల వర్షం.. ఇరాన్-ఇజ్రాయెల్ భీకర దాడులు