జెరూసలేం, ఏప్రిల్ 9 : ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలకు ఇస్లామాబాద్ వేదికగా మారింది. ఈ తరుణంలో ఇండియాలో ఇజ్రాయెల్ రాయబారి రీవెన్ అజార్ పాకిస్థాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ను ఇజ్రాయెల్ నమ్మటం లేదన్నారు. చర్చల సందర్భంగా తలెత్తే పరిస్థితిని పరిష్కరించడానికి అమెరికా మిత్రులపై ఆధారపడుతున్నామని చెప్పారు.
పశ్చిమాసియాలో ఇరాన్‌తో సాగుతున్న యుద్ధంపై బుధవారం కీలక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. రెండు వారాలపాటు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన అమెరికా-ఇరాన్.. ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలకు సిద్ధమవుతున్నాయి. యుద్ధ సంక్షోభంపై ఇరు వర్గాల మధ్య జరగనున్న ముఖాముఖి చర్చలకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వబోతున్నది.