సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Jul 28, 2020 , 20:21:26

ఆగస్టు 15న అయోధ్యలో ఉగ్రదాడికి ఐఎస్‌ఐ కుట్ర?

ఆగస్టు 15న అయోధ్యలో ఉగ్రదాడికి ఐఎస్‌ఐ కుట్ర?

న్యూఢిల్లీ : వచ్చే నెల 15న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ జన్మభూమిలో ఉగ్రదాడి చేసేందుకు పాక్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ సన్నాహాలు చేస్తోందని భారత నిఘావర్గాలు మంగళవారం తెలిపాయి. ఈ దాడికి లష్కరే, జైషే ఉగ్రవాదులకు ఐఎస్ఐ ఆఫ్గనిస్తాన్‌లో శిక్షణ ఇస్తుందని నిఘా సంస్థ రా తెలిపింది. దాడి కోసం అయోధ్యలోని మూడు నుంచి ఐదు గ్రూప్‌లకు చెందిన ఉగ్రవాదులను పంపాలని ప్లాన్‌ చేసింది. ఉగ్రవాద గ్రూప్‌ ప్రత్యేక దాడులు చేయాలని పాకిస్థాన్‌ కోరుకుంటోందని, భారత్‌లో అంతర్గత శక్తులే దాడి చేశాయని భావించేలా ప్లాన్‌ చేస్తున్నట్లు భారత నిఘా సంస్థ వెల్లడించింది.

వీవీఐపీలే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడే అవకాశం ఉందని, దాడి ప్రభావం ఎక్కువగా ఉండేలా ప్లాన్‌ చేస్తోందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా ఢిల్లీ, అయోధ్య, కశ్మీర్‌లో కార్యకలాపాలను అదుపు చేసేందుకు భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామ జన్మభూమికి శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా 2019 సంవత్సరంలో కశ్మీర్ నుంచి సెక్షన్ 370ని తొలగించిన రోజు కూడా ఇదే కావడం గమనించదగ్గ విషయం. నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌ సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నాయి. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా వేస్తున్నాయి. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo