IRGC : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెందిరింపుల నేపథ్యంలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC) కీలక హెచ్చరికలు చేసింది. హర్మూజ్ జలసంధి (Hormuz Strait)ని తెరవకుంటే ఖర్గ్ ద్వీపం, విద్యుత్ కేంద్రాలను పేల్చి వేస్తామని ట్రంప్ హెచ్చరించగా.. తామేమీ తక్కువ కాదంటూ యాపిల్, మైక్రోసాప్ట్ సహా ఆ దేశానికి చెందిన 18 కంపెనీలపై దాడులు చేస్తామని ఐఆర్జీసీ బదులు హెచ్చరిక చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమెరికాలోని టెక్ కంపెనీలే తమ ప్రధాన లక్ష్యమని ఐఆర్జీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
పశ్చిమాసియా యుద్ధంలో ఊహించని విధంగా ప్రతి దాడులతో అమెరికాకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్ ఈసారి ఆ దేశంలోని టెక్ కంపెనీలను లక్ష్యంగా చేసుకోనుంది. ఖర్గ్ ద్వీపం, విద్యుత్ కేంద్రాలను పేల్చి వేస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికాకు వణుకు పుట్టించేలా ప్రముఖ టెక్ సంస్థలపై, పారిశ్రామిక కేంద్రాలపై దాడులు చేయాలనుకుంటోంది.
IRAN’S IRGC: ISSUED A WARNING AGAINST 18 AMERICAN TECHNOLOGY COMPANIES, AMONG THEM MICROSOFT, APPLE, GOOGLE, INTEL, AND BOEING, STATING THAT THEY WILL BE CONSIDERED LEGITIMATE TARGETS IN RESPONSE TO TERRORIST OPERATIONS CARRIED OUT BY THE US AND ISRAEL.
— First Squawk (@FirstSquawk) March 31, 2026
ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రతీకార దాడులను తీవ్రతరం చేస్తామని, 18 సాంకేతిక కంపెనీలను టార్గెట్ చేస్తామని మంగళవారం ఐఆర్జీసీ వెల్లడించింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఇంటెల్, ఐబీఎం, టెస్లా, బోయింగ్.. వంటి కంపెనీలపై దాడులు చేసి.. వాటి వ్యవస్థను దెబ్బతీస్తామని హెచ్చరించింది.
‘ఇరాన్‌పై అమెరికా దాడులకు ప్రతిచర్యగా ఈ 18 కంపెనీల యూనిట్లపై దాడులు చేస్తాం. ఏప్రిల్ 1 వ తేదీ బుధవారం టెహ్రాన్ కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి దాడులు కొనసాగుతాయి. ఉగ్ర స్థావరాలను గుర్తించే అమెరికా ఐసీటీ, ఏఐ కంపెనీలు ఇకపై మా న్యాయబద్ధమైన లక్ష్యాలు’ అని ఐఆర్జీసీ ప్రకటించింది.