Iraq | ఇరాక్ (Iraq)లో ఇటీవలే ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఓ వివాహ వేడుకలో అగ్నిప్రమాదం చోటు చేసుకొని సుమారు 100 మందికిపైగా సజీవదహనమయ్యారు. మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇరాక్ మోసుల్ నగర శివార్లలోగల అల్-హమ్దానియాలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో గత వారం ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
వీడియోలో పెళ్లి తంతులో భాగంగా వధూవరులు (newlyweds ) ఎంతో రొమాంటిక్‌గా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తారు. ఆ సమయంలో అక్కడ ఇండోర్ పటాసులు కాలుస్తారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వేదికపై భాగం నుంచి ఒక్కసారిగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఇది గమనించిన అతిథులు ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు బయటకు పరుగులు తీస్తారు. అయితే, క్షణాల్లోనే ఆ మంటలు ఫంక్షన్‌హాల్ మొత్తం వ్యాపిస్తాయి. ఊహించని ఈ ఘటనతో అప్పటిదాకా పెళ్లి సందడితో కళకళలాడిన ఆ ఫంక్షన్ హాల్.. కాసేపట్లోనే హాహాకారాలు, ఆర్తనాదాలతో మార్మోగింది. శవాల దిబ్బగా మారిపోయింది.
In Iraq, due to Indoor fireworks a wedding becomes a funeral ground.
Bride and Groom survived but lost all of their Family members.
Approx 150 people died due to this mishappening.
Please avoid indoor fireworks and extra risky activities during events. #wedding #WeddingFire… pic.twitter.com/6SVfesK2Xw
— Abhishek Singhal (@abhitweets20) October 2, 2023
Also Read..
Rolls Royce | కేరళ యువకుడి అద్భుతం.. రూ.45వేలతో మారుతి 800 కారును రోల్స్ రాయిస్‌గా మార్చేశాడు
Nanded | నాందేడ్ ఆసుపత్రిలో మరణ మృదంగం.. 48 గంటల్లో 31 మంది మృతి.. 16 మంది చిన్నారులే