Rolls Royce | కేరళ యువకుడి అద్భుతం.. రూ.45వేలతో మారుతి 800 కారును రోల్స్ రాయిస్‌గా మార్చేశాడు
Rolls Royce | జీవితంలో ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉంటే సరిపోదు.. అందుకు తగ్గ కృషి కూడా ఉంటేనే మనం అనుకున్నది వందశాతం నెరవేర్చుకోగలం. అందుకు నిదర్శనం కేరళకు చెందిన ఓ కుర్రాడు (Kerala Teen).
Rolls Royce | జీవితంలో ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉంటే సరిపోదు.. అందుకు తగ్గ కృషి కూడా ఉంటేనే మనం అనుకున్నది వందశాతం నెరవేర్చుకోగలం. అందుకు నిదర్శనం కేరళకు చెందిన ఓ కుర్రాడు (Kerala Teen). తన పట్టుదల, కృషితో రూ.లక్షలు విలువ చేసే మారుతి 800 (Maruti 800) కారును రూ.కోట్లు విలువ చేసే రోల్స్ రాయిస్ (Rolls Royce) లుక్‌లోకి మార్చేశాడు.
కేరళకు చెందిన 18 ఏళ్ల హదీఫ్ (Hadif) కు కార్లంటే పిచ్చి. అందులోనూ ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం. ఒక్కసారైనా లగ్జరీ కారులో తిరగాలని కలలు కనేవాడు. అయితే, వాటిని కొనుగోలు చేసే స్తోమత హదీఫ్ కుటుంబానికి లేదు. అలాగని నిరాశపడకుండా తన ఆలోచనలకు పదునుపెట్టాడు. తన వద్ద ఉన్న చిన్న మారుతి 800 కారును లగ్జరీ కారుగా మార్చాలని సంకల్పించాడు. ఇందుకోసం నెలల తరబడి కష్టపడి పాత రోల్స్ రాయిస్ కార్ల విడిభాగాలను సేకరించాడు. ఆ విడిభాగాలను వెల్డింగ్ చేసి ఓ రూపానికి తీసుకొచ్చాడు. అలా ఆ విడిభాగాలను మారుతి 800 కారుకు అమర్చి రోల్స్ రాయిస్‌గా మార్చేశాడు. ఈ కారు చూస్తే నిజంగానే ఇది రోల్స్ రాయిస్ కారేనేమో అని అనుకోవాల్సిందే. అయితే, ఇదంతా చేయడానికి అతడు కేవలం రూ.45 వేలు మాత్రమే ఖర్చు చేయడం విశేషం.
ఇప్పుడు ఆ కారులో ఎంతో దర్జాగా చక్కర్లు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను హదీఫ్ తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు హదీఫ్ పట్టుదల, కృషిని కొనియాడుతున్నారు.
Also Read..
Nanded | నాందేడ్ ఆసుపత్రిలో మరణ మృదంగం.. 48 గంటల్లో 31 మంది మృతి.. 16 మంది చిన్నారులే
Congress MLA | వసుంధరా రాజే కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

